Tasty Teja: పోలీసులకు షాకిచ్చిన టేస్టీ తేజ
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, యూత్ ఎమోషన్స్‌తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు. అందులో భాగంగానే…యూట్యూబర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజను మార్చ్ 18న విచారణకు పిలిచారు. అయితే పోలీసుల నోటీసులు అందుకున్న వీళ్లిద్దరూ.. సాకులు చెప్పి విచారణకు డుమ్మా కొట్టే ప్రయత్నం చేశారు.
షూటింగ్‌లో ఉన్నాం… మీడియా ఉందన్న సాకుతో వాళ్లు విచారణకు రాలేమన్నారు. వారి తరపున ఈ విషయాన్ని పోలీసులకు చెప్పేందుకు శేఖర్ భాషాను పంపించారు. ఇక వాళ్లిద్దరి తరుఫున రంగంలోకి దిగిన ఆర్జే శేఖర్ భాషా.. సమయం కావాలని పోలీసులను కోరారు. దీంతో వాళ్లకు మరో మూడు రోజుల సమయం కేటాయించిప్పటికీ.. అందరికీ షాక్ ఇస్తూ నిన్న రాత్రే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ. విష్ణుప్రియ మాత్రం విచారణకు వచ్చేందుకు పోలీసులిచ్చిన మూడ్రోజుల సమయానికే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది…!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: దారుణంగా తిట్టి అవమానించాడు…స్టార్ డైరెక్టర్ పై నయన్ తీవ్ర ఆరోపణలు
డ్రగ్స్‌తో అప్రతిష్ట! షాకింగ్ నిర్ణయం తీసుకున్న హేమ
ఇక ఆధార్, మొబైల్‌తో ఓటర్ఐడీ లింక్ తప్పనిసరి
నాని Vs మోహన్ బాబు.. రసవత్తరమైన ఫైట్!
Chiranjeevi: లండన్‌లో మహిళా అభిమాని చేసిన పనికి చిరంజీవి రియాక్షన్