UKలో చిరు పేరుతో దందా..! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్…
మెగా స్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ప్రపంచ నలుమూలల్లో ఉన్నారు. ఆయన సినిమాలు చూస్తూ.. ఆయనను ఆరాధిస్తూనే ఉంటారు. వీలుదొరికితే ఆయనను కలిసేందుకు.. ఒక్క ఫోటో దిగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ ప్రయత్నాలనే కొందరు క్యాష్ చేసుకోవాలని చూశారు. హౌస్ ఆఫ్ కామర్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ తీసుకునేందుకు యూకేకు వెళ్లిన చిరుతో చిన్నపాటి బిజినెస్‌కు తెర తీశారు.
అయితే దీనిపైనే ఇప్పుడు మెగాస్టార్ కాస్త సీరియస్‌గా..కాస్త ఎమోషనల్ గా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే మెగా ఉత్సవం పేరిట లండన్‌లో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలనుకునే వారు.. 22 పౌండ్ల పెట్టి టికెట్ కొనుక్కోవాలంటూ ప్రకటనలు జారీ చేశారు నిర్వాహకులు. అయితే ఇలా తనను కలిసేందుకు డబ్బు వసూలు చేసిన నిర్వాహకుల తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు చిరు. ఇలాంటి ప్రవర్తనను తాను ఒప్పుకోనంటూ తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల అభిమానం వెలకట్టలేనిదని.. తనను కలవడానికి ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చిరు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాధికకు క్రేజీ బాయ్ శాపం! ఆ కుర్రాడి ఉసురు తీస్తోంది పాపం!
గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు
ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
వామ్మో… ఈ కాకి మామూల్ది కాదుగా.. వీటిని దొంగలించడమే దాని ప్రత్యేకత
స్కాన్ తీస్తుండగా కడుపులో.. వింత కదలికలు.. ఆస్పత్రికి వెళ్లగా..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

