ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత జనాల్లో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది. చిన్నా పెద్ద ముసలి ముతకా అందరూ రీల్స్ చేసేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ, ఎలాపడితే అలా రీల్స్ చేస్తూ నెట్టింట వ్యూస్, లైక్స్ కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో సాహసాలకు సైతం వెనుకాడకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
అలాంటి చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఓ మహిళ రీల్ చేద్దామని ఇంటిపైకెక్కి డాన్స్ చేసింది. చివరకు జరిగింది చూసి లబోదిబోమంది. ఓ మహిళ అందరికంటే భిన్నంగా రీల్స్ చేయాలనుకుంది. అందంగా చీర కట్టుకుంది. ఓ రేకుల షెడ్డుపైకి ఎక్కింది. హొయలు పోతూ చక్కగా డాన్స్ చేసింది. ఆ తర్వాత రేకుల షెడ్డు పైనుంచి కిందకి దిగేందుకు ప్రయత్నించింది. ఇక్కడే ఆమె పొరపాటు చేసింది. దిగడానికి ఏ నిచ్చెనో ఏర్పాటు చేసుకోవాలి కదా.. అలా కాకుండా డాన్స్‌తోపాటు స్టంట్ కూడా చేయాలనుకుందో ఏమో.. ఒక్కసారిగా పైనుంచి కిందకి దూకింది. ఈ క్రమంలో ఆమె కట్టుకున్న చీర రేకుల షెడ్డుకు తగులుకొంది. అంతే ఆమె స్టంట్ ఫెయిలయి.. ధబేల్న ముందుకు పడిపోయింది. పాపం బాగానే దెబ్బలు తగిలినట్టున్నాయి.. ఆమెను చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో… ఈ కాకి మామూల్ది కాదుగా.. వీటిని దొంగలించడమే దాని ప్రత్యేకత
స్కాన్ తీస్తుండగా కడుపులో.. వింత కదలికలు.. ఆస్పత్రికి వెళ్లగా..