SSC Paper Evaluation: పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే?
రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4తో పరీక్షలు ముగుస్తాయి. పరీక్షలు పూర్తయిన వెంటనే మూల్యాంకనం చేసేందుకు సైతం స్కూల్ ఎడ్యుకేషన్ సమాయత్తం అయింది. ఏప్రిల్ 4 న పరీక్షలు పూర్తి కాగానే స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు పేపర్స్ తరలిస్తారు..
Vidyasagar Gunti | Edited By: Srilakshmi C
Updated on: Mar 21, 2025 | 11:13 AM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష లు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎగ్జామ్స్ కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తి చేసేలా అన్ని చర్యలు విద్యాశాఖ తీసుకుంది. పరీక్షలు పూర్తయిన వెంటనే మూల్యాంకనం చేసేందుకు సైతం స్కూల్ ఎడ్యుకేషన్ సమాయత్తం అయింది. ఏప్రిల్ 4 న పరీక్షలు పూర్తి కాగానే స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు పేపర్స్ తరలిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 వాల్యుయేషన్ కేంద్రాల్లో ఏప్రిల్ 7 ఏప్రిల్ 15 వరకు సమాధాన పత్రాల స్పాట్ వాల్యుయేషన్ జరపనున్నారు. దీనికోసం సిబ్బంది ని సైతం విద్యాశాఖ నియమించింది. మూల్యాంకనం ముగిసిన కొద్ది రోజుల్లోనే దాదాపు ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు ఇవ్వాలని SSC బోర్డు భావిస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యం ఐన ఎట్టి పరిస్థితుల్లో మే మొదటి వారం లోపే రిజల్ట్ ఇవ్వనున్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలకి 2650 పరీక్షా కేంద్ ల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పదో పరీక్షల నిర్వహణలో భాగంగా 2,650 మంది సీఎస్ లు, డీవోలను, 28,100 మంది ఇన్విజిలేటర్ల పాల్గొన్నారు. ఒక్క నిమిషం నిబంధన సడలించి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వడంతో కాస్త చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు తగ్గాయి.

పరీక్ష కేంద్రాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు దాంతోపాటు పరీక్షా కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మాల్ ప్రాక్టీస్ లేదా ఇతరత్రా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ నెంబర్ను విద్యాశాఖ ముద్రించింది.





























