బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వియత్నాంలోని నేమ్‌సేక్ ప్రావిన్స్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఆస్పత్రి వైద్యులు 12 ఏళ్ల బాలిక కడుపులో నుంచి 900 గ్రాముల బరువున్న వెంట్రుకల గుట్టను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. బలహీనంగా, చర్మం పాలిపోయి.. కడుపు ఉబ్బరం, ఆకలి లేని స్థితిలో ఆస్పత్రిలో చేరింది సదరు బాలిక.
రక్త పరీక్షలు, ఉదర ఎక్స్‌రే, డైజెస్టివ్ ఎండోస్కోపీ చేసిన అనంతరం వైద్యులు.. ఆమెకు జీర్ణశయాంతర రక్తస్రావం, డ్యూడెనల్, గ్యాస్ట్రిక్ అల్సర్ల కారణంగా జీర్ణ రక్తస్రావం.. కడుపులో వెంట్రుక ముద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆ బాలికకు వెంటనే శస్త్రచికిత్స చేసి వెంట్రుకల ముద్దను తొలగించారు. బాలిక కడుపును దాదాపుగా ఆక్రమించేసాయి వెంట్రుకలు. ఆ భారీ వెంట్రుకల ముద్దను వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. ఆపరేషన్ అనంతరం బాలికను ఐసీయూకు తరలించిన వైద్యులు.. ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సదరు బాలికకు లిక్విడ్ డైట్ ఇస్తోన్న డాక్టర్లు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వెంట్రుకలు తినడం లేదా ట్రైకోఫాగియా అనేది రాపుంజెల్ సిండ్రోమ్‌తో ముడిపడిన అరుదైన ఈటింగ్ డిజార్డర్ అని వైద్యులు తెలిపారు. ఈ రుగ్మత కారణంగా కడుపులో జీర్ణం కాని వెంట్రుకలు పేరుకుపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్నారు. ట్రైకోఫేజియా సాధారణంగా పిల్లలు, యవ్వన దశలో ఉన్న బాలబాలికలకు సంభవించవచ్చునని అన్నారు. ముఖ్యంగా అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్, ట్రైకోటిల్లోమానియా ఉన్నవారిలో మానసిక, నాడీ సంబంధిత లక్షణాలు ఉండొచ్చునని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Pawan Kalyan: మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది’ పవన్ ఎమోషనల్

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్‌ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
