AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gambhir: టీమిండియాలో అతడే యమా డేంజర్.. 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఓపెనర్ సంజూ శాంసన్‌ను 2026 T20 ప్రపంచకప్‌కు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా అభివర్ణించారు. పవర్ ప్లేలో మ్యాచ్‌ను మార్చగల సామర్థ్యం సంజుకు ఉందని, జట్టులో దూకుడు పెంచేందుకే అతడిని ఎంపిక చేశామని గంభీర్ పేర్కొన్నారు.

Gambhir: టీమిండియాలో అతడే యమా డేంజర్.. 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!
Gambhir
Ravi Kiran
|

Updated on: Mar 16, 2026 | 12:50 PM

Share

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 2026 T20 ప్రపంచకప్‌లో టీమిండియాకు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ఓపెనర్ సంజూ శాంసన్‌ను అభివర్ణించారు. సంజూ శాంసన్ తనదైన రోజున పవర్ ప్లేలో ప్రత్యర్థి జట్ల నుంచి మ్యాచ్‌ను లాగేసుకోగలడని గంభీర్ అన్నాడు. ఇండియా మూడోసారి T20 ప్రపంచకప్ నెగ్గడంలో సంజు కీలక పాత్ర పోషించాడని, అతని బ్యాట్ పవర్ పట్ల తమకు ఎప్పుడూ అనుమానం లేదని గంభీర్ ప్రశంసలు కురిపించాడు. తొలి ఆరు ఓవర్లలోనే జట్టుని గెలిపించే సత్తా సంజుకు ఉందని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.

వరల్డ్ కప్ తుది జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నప్పటికీ, కేవలం కాంబినేషన్ మార్చడం కోసం కాకుండా జట్టులో మరింత దూకుడు పెంచేందుకే శాంసన్‌ను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా జట్టులో వీలైనంత దూకుడుగా ఆడాలనే సిద్ధాంతంతో ఉన్నామని గంభీర్ పేర్కొన్నారు. అందుకే ఆఫ్ స్పిన్నర్‌కు కౌంటర్ ఇచ్చేందుకు కాకుండా, టాప్ ఆర్డర్ పవర్ పెంచేందుకు, పవర్ ప్లేలో మరింత దూకుడుగా ఆడేందుకే సంజును ఓపెనర్‌గా దింపామన్నారు. ఒక్కొక్కసారి సంజు జోరు మొదలైతే, ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను నిలబెట్టగలడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

సంజు మెరుపు బ్యాటింగ్ శైలిపై తమకు ఎలాంటి సందేహాలు లేవని, అతను ఏం చేయగలడో తమకు బాగా తెలుసని గంభీర్ తెలిపారు. టాప్ ఆర్డర్‌లో చెలరేగిపోయే మరో బ్యాటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నాకౌట్ సమయంలో శాంసన్‌ను తీసుకొచ్చామని గంభీర్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీలోని ఐసీసీ వార్షిక అవార్డుల వేడుక కార్యక్రమంలో గౌతమ్ గంభీర్ చెప్పకొచ్చాడు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.

ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..

Follow Us
పదో తరగతి పరీక్ష రాస్తుండగా వింత శబ్ధాలు.. మ్యాటర్ తెలిసి..
పదో తరగతి పరీక్ష రాస్తుండగా వింత శబ్ధాలు.. మ్యాటర్ తెలిసి..
ఎయిర్ ఇండియాలో టిక్కెట్ల స్కామ్.. 4,000 మంది ఉద్యోగులపై వేటు!
ఎయిర్ ఇండియాలో టిక్కెట్ల స్కామ్.. 4,000 మంది ఉద్యోగులపై వేటు!
టీమిండియాలో అతడే యమా డేంజర్... 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!
టీమిండియాలో అతడే యమా డేంజర్... 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!
ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే.. అప్పు ఇచ్చినవాడు చనిపోయినా
ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే.. అప్పు ఇచ్చినవాడు చనిపోయినా
పండగ బట్టల కోసం భర్తతో గొడవ.. 14 నెలల కూతురిని చంపేసిన తల్లి..
పండగ బట్టల కోసం భర్తతో గొడవ.. 14 నెలల కూతురిని చంపేసిన తల్లి..
ప్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు ఎక్స్‌ప్రెస్ వే
ప్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు ఎక్స్‌ప్రెస్ వే
డ్యాన్స్ ఇరగదీసిన హీరోయిన్ సిమ్రాన్.. చంపేసారండీ బాబు..
డ్యాన్స్ ఇరగదీసిన హీరోయిన్ సిమ్రాన్.. చంపేసారండీ బాబు..
స్కీమ్ అంటే ఇట్లా ఉండాలి.. ఒక్కసారి డబ్బు పెడితే.. ప్రతి నెలా..
స్కీమ్ అంటే ఇట్లా ఉండాలి.. ఒక్కసారి డబ్బు పెడితే.. ప్రతి నెలా..
ఇంట్లో కామధేనువు విగ్రహం ఉందా? ఈ దిశలో పెడితేనే అదృష్టం వరించేది!
ఇంట్లో కామధేనువు విగ్రహం ఉందా? ఈ దిశలో పెడితేనే అదృష్టం వరించేది!
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..