AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమ్మ పక్కన ఉండగానే మాయగా వచ్చి బాలికపై దాడి చేసిన కుక్క.. షాకింగ్ విజువల్

బాబోయ్ కుక్కలు. ఇంటి గడప దాడి కాలు బయటపెట్టేమంటే పరిస్థితులు అంతే సంగతులు అన్నట్లుగా ఉన్నాయి. ఎప్పుడు ఏ శునకం వచ్చి అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. తాజాగా మహాంకాళి నగర్‌లో వీధికుక్క బీభత్సం సృష్టించింది. నాలుగేళ్ల యోగితపై దాడికి పాల్పడింది.

Hyderabad: అమ్మ పక్కన ఉండగానే మాయగా వచ్చి బాలికపై దాడి చేసిన కుక్క.. షాకింగ్ విజువల్
Dog Attack
Sridhar Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 30, 2024 | 7:55 PM

Share

హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న కాలనీలలో కుక్కలు చెలరేగి పోతున్నాయి. చిన్న పెద్దా తేడ లేకుండ కుక్కలు పట్టి పీకుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. చికెన్ షాపుల ముందు పదుల సంఖ్యలో కుక్కలు ఉంటున్నాయి. అటువైపు వెళ్లాలంటేనే భయంతో పిల్లలతో సహా పెద్దలు కూడా వణుకుతున్నారు. స్థానిక ఆసుపత్రులకు కుక్క కరిచిన బాధితులు క్యూ కడుతున్నారు. ప్రతి నెల వందల సంఖ్యలో కుక్క కాటు బాధితులు ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

ఇటు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్లోని మహాంకాళి నగర్‌లో కుక్కల భీవత్సం సృష్టిస్తున్నాయి. కాలనీ మొత్తం కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. తల్లితో కలిసి కిరాణ దుకాణానికి వెళ్లి వస్తుండగా నాలుగేళ్ల యోగితపై వీధి కుక్క మాయగా వచ్చి ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే పాప తల్లి స్పందించడంతో కుక్క పారిపోయింది. లేకుంటే పరిస్థితి ఏంటి..? అన్న స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేపించారు. ఇప్పటికే ఆ కాలనీలో నలుగురిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో తీసుకెళ్లి పక్క కాలనీలో వదులుతున్నారని కుక్కలకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

కుక్క దాడి వీడియో దిగువన చూడండి…

కొంత మంది వీధి కుక్కలకు ఆహరం తెచ్చి పెడుతున్నారని, దానితో పాటు చికెన్ షాప్‌ల ముందు అడ్డగోలుగా పడవేసే చికెన్ వ్యర్థాలకు అలవాటు పడ్డ కుక్కలు.. ఫుడ్ దొరకని సమయంలో పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తూ కనిపించిన వారిపై దాడి చేస్తాయంటున్నారు స్థానికులు. ముఖ్యంగా కుక్కలకు ఆహారం, నీళ్లు సమయంలో కూడా ఇలా మనుషులపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని పశు వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. కుక్క కరిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి టిటి ఇంజక్షన్ ఆ తర్వాత ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి