తెలుగు ప్రింట్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..
2005 నుండి 2021 వరకు ఈనాడులో పని చేశాను.
2021 నుండి 2024 ఏప్రిల్ వరకు టీవీ9 స్ట్రింగర్ గా ఖమ్మం లో పని చేశాను.
ప్రస్తుతం హైదరాబాద్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను
Hyderabad: ఊపిరితిత్తుల లోపలికి పేగులు.. అరుదైన శస్రచికిత్స చేసి పసికందుల్ని కాపాడిన నీలోఫర్ వైద్యులు
ప్రస్తుత కాలంలో కొందరు శిశువులు పుడుతూనే వింత వ్యాధులతో జన్మిస్తున్నారు. కొన్ని అంతుచిక్కని వ్యాధులైతే.. కొన్ని ఖరీదైన చికిత్స చేయాల్సిన వ్యాధులతో పుడుతున్నారు. నవమాసాలూ మోసి, కన్న ఆ చిన్నారులను బ్రతికించుకోడానికి తల్లిదండ్రులు అష్టకష్టాలూ పడుతున్నారు. ఈ క్రమంలో నీలోఫర్ ఆస్పత్రిలో అప్పడే పుట్టిన నలుగురు నవజాత శిశువులకు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణంపోశారు నీలోఫర్ వైద్యులు.
- Sridhar Rao
- Updated on: Apr 16, 2025
- 10:08 am
Telangana Weather: ఎండల నుంచి బిగ్ రిలీఫ్.. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు
మండుతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 1 తేదీ నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
- Sridhar Rao
- Updated on: Mar 31, 2025
- 5:08 pm
పాల వ్యాపారం పేరుతో భారీ స్కామ్.. గేదెల పేరుతో 20 కోట్లకు కుచ్చు టోపీ!
కొండపల్లి డెయిరీ ఫారం పేరుతో హైదరాబాద్ లో రూ.20 కోట్ల పెట్టుబడిదారుల మోసం జరిగింది. 500 గేదెలపై పెట్టుబడి పెట్టమని ప్రకటనలు ఇచ్చి, మంచి లాభాలను ఆశించిన 20 మందికి పైగా పెట్టుబడిదారులు మోసపోయారు. అక్రమార్కులు ప్రతి మూడు నెలలకు 37 శాతం వడ్డీ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Sridhar Rao
- Updated on: Mar 28, 2025
- 5:29 pm
Hyderabad: మెట్రో స్టేషన్లలో వాహనాలు పార్క్ చేస్తున్నారా..? అయితే మీరూ బాధితులే
డియర్ ప్యాసింజర్స్ దయచేసి వినండి.. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేందుకు మీ బండిని స్టేషన్లలో పార్క్ చేస్తున్నారా? అయితే.. మీ వాహనం ఎండకు మాడిపోవచ్చు.. వానకు తడవొచ్చు.. గాలి దుమారానికి కొట్టుకుపోవచ్చు. అడిగినంత చార్జీలు చెల్లించండి.. కానీ కనీస సౌకర్యాలు ఎక్కడని అడగొద్దంటోంది హైదరాబాద్ మెట్రో. అంతేకాదూ.. గాడీ గాయబ్ అయినా ప్రశ్నించొద్దని తెగేసి చెబుతోంది. ఇన్ని చెబుతూనే.. బాదుడే బాదుడుకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మెట్రో వసూళ్ల పర్వానికి.. సగటు వాహనదారుడు బెంబేలెత్తిపోతున్నాడు.
- Sridhar Rao
- Updated on: Mar 26, 2025
- 5:44 pm
Petrol Bunks: బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు మనకు ఇంకా ఎలాంటి సేవలు అందించాలో తెలుసా?
పెట్రోల్ బంకులు కేవలం ఇంధనం అందించడానికి మాత్రమే కాకుండా, వినియోగదారులకు అనేక ముఖ్యమైన సేవలు అందించాలి. తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స, గాలి నింపు యంత్రం వంటివి అందుబాటులో ఉండాలి. బంకుల్లో సేవలు సరిగా లేకపోతే, లేదా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే, సంబంధిత పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయడానికి టోల్-ఫ్రీ నంబర్లు కూడా ఇవ్వబడ్డాయి.
- Sridhar Rao
- Updated on: Mar 19, 2025
- 3:40 pm
Telangana: రైలు ప్రమాదం జరిగితే ఏం చేయాలి.? ఎలాంటి చర్యలు తీసుకోవాలి..
రైలు ప్రమాదం జరిగితే ఏం చేయాలి.? ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే విషయాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించగా.. అసలు ఏం జరిగింది.? ఆ వివరాలు ఎలా.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..
- Sridhar Rao
- Updated on: Mar 12, 2025
- 8:29 pm
Hyderabad: అందరూ దేవుడ్ని మొక్కేందుకు గుడికొస్తే.. ఈ మహిళలు చేసిన పని చూస్తే..
అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వెళ్తారు. కానీ వీరు మాత్రం చేసే పనులివి.. ఎంచక్కా భక్తుల మాదిరిగా గుడిలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత చేయాల్సిన పని చేసి.. గప్పుచుప్పుగా వెళ్లిపోయారు. ఇంతకీ వాళ్లు చేసిన పని ఏంటి.? ఆ వివరాలు ఇలా..
- Sridhar Rao
- Updated on: Mar 10, 2025
- 8:31 pm
Telangana: ఎండలు టాప్ లేపెస్తాయ్.. బాబోయ్.! ఏకంగా 125 ఏళ్ల రికార్డు బద్దలవుతుంది
తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు మరింత పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36-38.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..
- Sridhar Rao
- Updated on: Mar 1, 2025
- 9:17 pm
Hyderabad: ఎదుటి వారి అత్యశే.. అతనికి క్యాష్ అయింది.. పుల్లయ్య టోకరా మామూలుగా లేదుగా..
అంత వడ్డీ వస్తుంది.. ఇంత వడ్డీ వస్తుంది.. ఇక మీరు లక్షాధికారులే.. నన్ను నమ్మండి.. అంటూ అందరినీ నమ్మించాడు.. కోట్లకు కోట్లు వసూలు చేశాడు.. కట్ చేస్తే, ఆ డబ్బులన్నీ జమ చేసుకుని పరారయ్యాడు.. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో ఓ వ్యక్తి అందరినీ నట్టేట ముంచిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది..
- Sridhar Rao
- Updated on: Feb 27, 2025
- 5:37 pm
Hyderabad: హైదరాబాద్ మార్కెట్లో మామిడి పండ్లు.. కేజీ ఎంతో తెల్సా.
పండ్లలో రారాజు మామిడి పండు. సాధారణంగా మామిడి పండ్లంటే ఇష్టపడని వాళ్లే ఉండరు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే లొట్టలేసుకుంటూ మామిడి పండ్లను తిండం చూస్తుంటాం. ప్రస్తుతం మార్కెట్లో మామిడి పళ్లు నోరూరిస్తున్నాయ్.. చూడగానే ముచ్చటేస్తున్నాయ్. ధరలు ఎలా ఉన్నా.. తినాలనే కోరిక మాత్రం ఆగడం లేదు. సమ్మర్లో స్వీట్ మ్యాంగో టేస్ట్ చేకుంటే ఆ జీవితమే వేస్ట్ అనిపిస్తుంది.
- Sridhar Rao
- Updated on: Feb 25, 2025
- 4:43 pm
Health Tips: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? వెంటనే అలెర్ట్ అవ్వండి.. లేదంటే.!
పిల్లలపై మైకో ప్లాస్మానిమోనియా పంజా విసురుతోంది. అయిదు సంవత్సరాలలోపు పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్యులు. మైకో ప్లాస్మానిమోనియా పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని.. దీంతో పిల్లలు తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని ఆసుపత్రుల్లో మైకోప్లాస్మానిమోనియా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
- Sridhar Rao
- Updated on: Feb 17, 2025
- 10:06 pm
Heart Attack: లేత వయసులోనే పిట్టల్లా రాలుతున్న పసి పిల్లలు.. గుండె జబ్బులు గుర్తించడం ఎలా?
చిన్న వయసులోనే గుండె పోటు.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నారు. డ్యాన్స్ చేస్తూ కొంత మంది.. కూర్చున్న చోటే కొంత మంది గుండె పోటుతో నేల రాతిపోతున్నారు. అందులో ఎక్కువగా యువతే ఉండడం ఆందోళన కలిగిస్తుంది.చిన్నా-పెద్దా, స్త్రీ- పురుషులు అనే తేడాలు లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ప్రాణాలు విడుస్తున్నారు
- Sridhar Rao
- Updated on: Feb 16, 2025
- 2:55 pm