AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు.. ఖైరతాబాద్ గణేషుడి ఆగమనం మీరూ చూశారా.?

బుధవారం వినాయకచవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేషుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతిలు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు.

Hyderabad: 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు.. ఖైరతాబాద్ గణేషుడి ఆగమనం మీరూ చూశారా.?
Khairatabad Ganesh
Sridhar Rao
| Edited By: |

Updated on: Aug 26, 2025 | 1:33 PM

Share

బుధవారం వినాయకచవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేషుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతిలు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. 1954లో ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం.. 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ.. ఆపై 2014 నుంచి ప్రతియేటా ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు. ఖైరతాబాద్ గణేశునికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. మహా గణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు, 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు.

రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ మార్గం మూసివేసి నిరంకారీ జంక్షన్ వైపు, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బడా గణేశ్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మీనార్ వైపు, మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగు తల్లి జంక్షన్ వైపు, మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు, ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ నుంచి రైల్వే గేట్ వైపు వెళ్లే ట్రాఫిక్ పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వైపు ట్రాఫిక్ మళ్ళించారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వారు రేస్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, హెచ్ఎండీఏ పార్కింగ్, ఐమాక్స్ ఎదుట ఖాళీ స్థలం, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ వద్ద, ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

69 అడుగుల ఎత్తు, 28 ఆడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా రూపుదిద్దుకుంటున్నాడు. గణపయ్యకు ఇరువైపులా పూరి జగన్నాథుడు సుభద్ర, బలరాముడి సహా లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి, ఖైరతాబాద్ గ్రామదేవతగా పిలువబడే గజ్జెలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు. గణపతికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల హోమాలు చేస్తారు.. అదేవిధంగా కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తీసుకువచ్చి గణపతి మెడలో వేస్తారు. వినాయకుడి కళ్యాణంతో పాటు పదవి విరమణ చేసిన ప్రభుత్వ పురోహితులచే లక్ష వినాయక నామార్చన చేయనున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి  60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పిస్తారు. 

ఖైరతాబాద్ గణేషుడి విశేషాలు..

  • తొలినాళ్ళో హైదరాబాద్ నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా.. ఇక్కడ మాత్రం 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు జరిగేవి.
  • 1960లో ఖైరతాబాద్ వినాయకుడిని ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
  • 1982లో రెండు పడవలను కలిపి వాటిపై ఖైరతాబాద్ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
  • 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను ఖైరతాబాద్ గణపతి చేతిలో ఉంచారు.
  • తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడునెలలపాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.