AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly LIVE: ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ.. గవర్నర్ ప్రసంగం.. లైవ్ వీడియో

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందుగా.. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2026 | 12:23 PM

Share

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా సభలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు.  తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్..  తెలంగాణ పురోగతిలో ప్రతిపౌరుడు భాగస్వామి.. అని.. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా మా పాలన సాగుతోందని పేర్కొన్నారు. 2047 తెలంగాణ రైజింగ్‌ దిశగా అడుగులు వేస్తున్నాం.. ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతోంది.. కోర్, ప్యూర్, రేర్‌గా తెలంగాణను విభజించామని గవర్నర్ పేర్కొన్నారు.

సమావేశాల ప్రారంభానికి ముందుగా.. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. .. గాంధీ విగ్రహానికి లెఫ్ట్ సైడ్‌లో ఇప్పటికే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు గాంధీ విగ్రహానికి రైట్ సైడ్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు.

గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) భేటీ జరగనుంది.. బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన అజెండా.. ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి.. అనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మంగళ, బుధ వారాల్లో.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన చర్చ, సమాధానం ఉంటాయి. అనంతరం.. బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Follow Us