AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే అద్భుతమైన రోటీలు.. లాభాలు తెలిస్తే ఇప్పుడే తింటారు..

గోధుమ పిండి, మైదాతో చేసే పరోటా, చపాతీలకు ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యకరమైన రాగి రోటీలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువ చేసే రాగి పిండి రోటీలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పళ్ళు లేని వారు కూడా తేలికగా తినగలిగేలా మెత్తగా, నోరూరించే రాగి రోటీలను ఎలా తయారు చేయాలో చూద్దాం..

పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే అద్భుతమైన రోటీలు.. లాభాలు తెలిస్తే ఇప్పుడే తింటారు..
Easy Ragi Roti Recipe
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2026 | 12:49 PM

Share

గోధుమ పిండి, మైదాతో తయారు చేసే పరోటా, పుల్కా, చపాతీలకు.. ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం రాగి రోటీలు. రాగులు (ఫింగర్ మిల్లెట్) అత్యంత పోషకమైనవి.. ఇవి శరీరానికి చలువ చేయడమే కాకుండా, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పెద్ద ఎత్తున కేలరీలతోపాటు.. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, రక్తహీనతను నివారించే ఐరన్, బరువు నియంత్రణకు సహాయపడే డైటరీ ఫైబర్.. అమినో యాసిడ్స్‌కు రాగులు అద్భుతమైన మూలం.. అందుకే.. రాగులతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పళ్ళు లేని వృద్ధులు సైతం తేలికగా తినగలిగేంత మెత్తగా, రుచికరంగా ఈ రాగి రోటీలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

  • రాగి పిండి
  • నీళ్లు
  • ఉప్పు
  • నూనె

రాగి రోటీ తయారీ విధానం:

పిండిని సిద్ధం చేయడం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒకటింపావు కప్పుల నీళ్లు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం ప్రారంభం కాగానే, ఒక కప్పు రాగి పిండిని వేసి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచాలి. పిండి ఉండలు కట్టకుండా అర నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. పిండిని బాగా ఒత్తుతూ కలిపిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి.

పిండిని మెత్తగా కలపడం: ఇప్పుడు మూత తీసి, పిండి పూర్తిగా చల్లారిపోకుండా, చేతితో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడే, చేతితో బాగా ఒత్తుతూ కలపాలి. ఇలా కలపడం వల్ల పిండి స్టిక్కీగా అయ్యి, రోటీలు విరిగిపోకుండా, పగుళ్లు లేకుండా మెత్తగా వస్తాయి.

రోటీలను ఒత్తడం: కావలసిన సైజులో పిండిని తీసుకుని ఉండ చేసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రోటీ కోసం ఉండ తీసుకున్నప్పుడల్లా పిండిని బాగా పిసికి అప్పుడు రోటీ ఒత్తుకున్నట్లయితే విరిగిపోకుండా సాఫ్ట్‌గా వస్తాయి. తర్వాత చపాతీ పీట మీద రాగి పిండి చల్లుకొని వీటిని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైపైన పల్చగా ఒత్తుకోవాలి. ఇవి గుండ్రంగా రావడం కోసం షార్ప్ అంచులు గల మూతతో కట్ చేసుకోవచ్చు. రోటీ అన్ని వైపులా సమానంగా ఉండడం కోసం మరోకసారి పైపైన పల్చగా చేసుకోవాలి.

రోటీలను కాల్చడం: ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే రోటీని వేసుకోవాలి. తర్వాత నీళ్లలో ముంచిన తడిబట్ట తీసుకుని ఈ రోటీ పైన నీళ్లు కొంచెం అద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల రోటీలు మరింత సాఫ్ట్‌గా వస్తాయి. 10-15 సెకన్ల పాటు హై ఫ్లేమ్‌లో కాలిన తర్వాత చిన్న చిన్న బబుల్స్ రావడం ప్రారంభం అవుతాయి. అప్పుడు రోటీని తిరగేసి మరొక 10-15 సెకన్లు కాలనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరగేసి పొడిబట్టతో నెమ్మదిగా ప్రెస్ చేయాలి. చక్కగా కాలిన ఈ రోటీలను డైరెక్ట్‌గా ప్లేట్‌లో వేయకుండా ఏదైనా పొడిబట్ట మీద గానీ, టిష్యూ పేపర్ మీద గానీ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వేడివేడి రోటీల్లో ఉండే ఆవిరికి ఇవి తడిచి మెత్తగా అయిపోకుండా పొడిగా ఉంటాయి. ఒక నిమిషం పాటు బట్ట మీద ఉంచిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. రోటీలు కాల్చడానికి పాత నాన్-స్టిక్ పెనం కంటే, ఐరన్ పెనం అయితే మంచిది.

రాగి రోటీల ఆరోగ్య ప్రయోజనాలు:

  • ఎముకల బలం: ఎదిగే పిల్లల్లో ఎముకలు గట్టిగా అవ్వడానికి, ముఖ్యంగా ఆడపిల్లలకు రాగి అత్యంత ప్రయోజనకరం. ఇది కాల్షియం గొప్ప మూలం
  • రక్తహీనత నివారణ: రాగిలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారించి, శరీరంలో రక్తం పట్టడానికి సహాయపడుతుంది.
  • మధుమేహ నియంత్రణ: షుగర్ ఉన్నవాళ్లకు రాగి రోటీలు చాలా మంచివి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
  • బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి రాగి రోటీలు ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
  • శరీరానికి చలువ: శరీరానికి చలువ చేయడానికి రాగి పిండి సహాయపడుతుంది.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రాగి రోటీలను ఏదైనా స్పైసీగా ఉండే వెజ్ లేదా నాన్-వెజ్ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి రుచికి ఇది గొప్ప ఎంపిక అని ఆహార నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?
నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?
రిలీజ్‌కు ముందే మేకింగ్ వీడియోతో నోలన్ సర్‌ప్రైజ్
రిలీజ్‌కు ముందే మేకింగ్ వీడియోతో నోలన్ సర్‌ప్రైజ్
ISROలో 120 మంది సైంటిస్టుల రాజీనామాలు.. అసలేం జరుగుతోందక్కడ..?
ISROలో 120 మంది సైంటిస్టుల రాజీనామాలు.. అసలేం జరుగుతోందక్కడ..?
తెలంగాణలో బోనాల సందడి ప్రారంభం.. గోల్కొండలో తొలి బోనంతో ఆషాఢ..
తెలంగాణలో బోనాల సందడి ప్రారంభం.. గోల్కొండలో తొలి బోనంతో ఆషాఢ..
కార్డిఫ్‌లో టాస్ గెలిస్తేనే.. లేదంటే మ్యాచ్ పోయినట్లే..!
కార్డిఫ్‌లో టాస్ గెలిస్తేనే.. లేదంటే మ్యాచ్ పోయినట్లే..!