నంద్యాల జిల్లా గాజులపల్లెలోని శ్రీ గంగా గౌరీ సమేత మరకతలింగేశ్వర ఆలయంలో పాండవపత్తి అనే విచిత్రమైన మొక్క భక్తులను ఆకర్షిస్తోంది. దీని శాస్త్రీయ నామం కల్లికార్పా టోమెంటోసా. ఈ ఆకుకు నూనె రాసి వెలిగిస్తే సాధారణ వత్తుల కంటే ఎక్కువసేపు, తక్కువ పొగతో దీపం వెలుగుతుంది. పాండవులు అరణ్యవాసంలో దీనిని దివిటీగా వాడారని ప్రతీతి.