Telangana: ప్రేమ పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ.. ఈ ఎమ్మెల్యే రూటే సపరేటు..
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు మరో ప్రేమ జంటకు సాయం అందించారు. వారి పెళ్లి జరగడంలో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పటివరకు 50 మంది ప్రేమ జంటలకు ఆయన పెళ్లి చేశారు. తాను కూడా ప్రేమ పెళ్లి చేసుకుని ఎన్నో ఇబ్బందుల పడ్డానని అన్నారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేమ పెళ్లిళ్లు చేయడంలో హాఫ్ సెంచరీ చేసిన ఆయన.. తన ప్రేమ ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా వర్ధన్నపేటలో ఓ యువతి ప్రేమ పోరాటానికి మద్దతుగా నిలిచిన ఆయన.. ఎట్టకేలకు ఆ జంటకు పెళ్లిచేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే తన జీవిత భాగస్వామి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 2023 మార్చిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తూ పదవివిరమణ పొందిన అనంతరం రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా తన ప్రేమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ప్రేమపెళ్లి చేసుకొని తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, తన జీవిత భాగస్వామి మల్లీశ్వరి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కే.ఆర్ నాగరాజు కుమిలి పోయారు. పోలీస్ గా ఉద్యోగం చేసిన సమయంలో ఎంతోమంది ప్రేమికులు తనను ఆశ్రయించారని తెలిపారు. తన కొడుకు, కూతురుతో సహా 50 జంటలకు పెళ్లిళ్లు చేశానని తెలిపారు. తాజాగా గత నాలుగు రోజులుగా వరంగల్ వర్ధన్నపేటలో జరుగుతున్న శ్రీదేవి అనే యువతి ప్రేమ పోరాటానికి ఎమ్మెల్యే మద్దతుగా నిలిచారు. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి తనయుడు శ్రీకాంత్ తనను ప్రేమించి వదిలించుకోవాలని చూసాడని శ్రీదేవి న్యాయ పోరాటం చేపట్టింది. శ్రీకాంత్ ఇంటి ముందు గత నాలుగు రోజులుగా న్యాయపోరాటం చేపట్టింది. ఈ క్రమంలో ఆ యువతకి పలు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి..
ఈ క్రమంలో ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.. ఆ యువకుడు, అతని తల్లిదండ్రులను ఒప్పించి ఆ ప్రేమజంటను ఒక్కటి చేశారు. ప్రియుడు దిగొచ్చాలా చేశాడు.. ఆ యువతి న్యాయపోరాటం చేస్తున్న చోటే ఆమె మెడలో తాళి కట్టించి వాళ్ళిద్దరినీ పెళ్లి పీటలు ఎక్కించాడు. ఆ యువతి ప్రేమ పోరాటానికి దిగినచోటే తాళి కట్టించారు. అనంతరం ఆ ప్రేమ జంట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఇంటికి వచ్చి ఎమ్మెల్యే దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు.. ఆ జంటకు పెళ్లి చేసిన ఆనందంలో ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను కూడా ప్రేమ పెళ్లి చేసుకొని జీవితంలో ఎన్ని ఇబ్బందులకు ఎదుర్కొన్నానని అన్నారు. తన జీవిత పయనంలో తన భాగస్వామి ఎలా వెన్నుతట్టి ప్రోత్సహించిందో గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్బంగా తాను పోలీస్ అధికారిగా, నేడు ప్రజాప్రతినిధిగా దాదాపుగా 50 ప్రేమ పెళ్లిళ్లు చేశానని తెలిపారు.
