AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppu Senagalu: ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!

సాయంత్రం టీ తాగే సమయంలో లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేళ ఏదైనా క్రిస్పీగా, హెల్దీగా తినాలనిపించినప్పుడు గుర్తొచ్చే బెస్ట్ ప్రోటీన్ స్నాక్ 'ఉప్పు శెనగలు'. సాధారణంగా వీటిని బయట బండ్ల దగ్గర లేదా స్నాక్ స్టోర్లలో కొనుక్కుంటూ ఉంటాం. ఇంట్లో చేద్దామని ట్రై చేసినప్పుడు అవి సరిగ్గా పఫ్ కాకపోవడం, మాడిపోవడం లేదా రాళ్లలా గట్టిగా ఉండిపోవడం జరుగుతుంది. అయితే దీనికి ఒక చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు.

Phani CH
|

Updated on: Oct 08, 2026 | 10:12 PM

Share
కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చి శెనగలు నల్లవి, 1 టీస్పూన్ వంట నూనె, 1 ఫుల్ కప్పు ఉప్పు వేయించడానికి, తయారీ విధానం:  ఒక బౌల్‌లో ఒక కప్పు పచ్చి శెనగలను తీసుకోవాలి. వీటిని నానబెట్టడం కానీ, ఫ్రై చేయడం కానీ చేయకూడదు. ఈ శెనగలకు ఒక టీస్పూన్ నూనె వేసి, గరిటెతో ప్రతి శెనగకు నూనె సమానంగా పట్టేలా బాగా కలపాలి. ఇలా నూనెతో కోట్ చేసిన శెనగలను పక్కన ఉంచుకోవాలి.

1 / 5
స్టవ్‌పై వెడల్పాటి అల్యూమినియం లేదా పలుచటి రేకు పాన్ పెట్టుకోవాలి. మందపాటి పాన్ వాడకూడదు, పలుచటి రేకులా ఉంటేనే వేడి శెనగలకు వేగంగా అందుతుంది. పాన్‌లో ఒక కప్పు నిండుగా సాల్ట్ (ఉప్పు) వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ ఉప్పును విపరీతమైన వేడి వచ్చేంత వరకు వేడిచేయాలి. ఉప్పు ముట్టుకోవడానికి వీల్లేనంత తీవ్రమైన వేడికి చేరాలి; ఈ హీట్ సరిగ్గా లేకపోతే శెనగలు పఫ్ కావు.

2 / 5
ఉప్పు బాగా హీట్ అయ్యాక, ఆయిల్ పట్టించి ఉంచిన శెనగల్లోంచి కేవలం 2 నుండి 3 టేబుల్ స్పూన్ల శెనగలను మాత్రమే వేయాలి ఒకేసారి ఎక్కువ వేస్తే ఉప్పు టెంపరేచర్ పడిపోయి శెనగలు పేలవు. మంట హై ఫ్లేమ్‌లోనే ఉంచి శెనగలను గరిటెతో ఆపకుండా కలుపుతూ టాస్ చేయాలి. అలా 5-10 సెకన్లు కలపగానే శెనగలు పేలడం మొదలవుతాయి.

3 / 5
శెనగలు పేలడం ప్రారంభం కాగానే వెంటనే మంటను లో ఫ్లేమ్‌కి తగ్గించేయాలి. సన్నటి సెగపై మరో 5 సెకన్లలోనే అన్ని శెనగలు పుట్నాల మాదిరిగా విచ్చుకుని చక్కగా పఫ్ అయిపోతాయి. అన్నీ పేలిన వెంటనే జాలి గరిటెతో శెనగలను ఉప్పు నుంచి వేరుచేసి వెంటనే బౌల్‌లోకి తీసేయాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ విపరీత వేడికి శెనగలు మాడిపోయి రంగు మారిపోతాయి.

4 / 5
మరుసటి బ్యాచ్ వేసే ముందు తిరిగి మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఉప్పును మళ్లీ బాగా హీట్ చేయాలి; ఆ తర్వాతే 2-3 చెంచాల శెనగలు వేసి ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. అంతే, ఇంట్లోనే ఎంతో సులభంగా 2 నిమిషాల్లో వేడివేడి క్రిస్పీ 'ఉప్పు శెనగలు' సిద్ధం! చల్లారాక ఎయిర్‌టైట్ గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఎప్పుడు కావాలన్నా ఫ్రెష్‌గా, కరకరలాడుతూ ఉంటాయి!

5 / 5
Follow Us