Tollywood: టాలీవుడ్ స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి.. కూతురి వివాహ ముహూర్తం ఫిక్స్.. ఫొటోస్ వైరల్
వీరిద్దరు దాదాపు 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా లభించడంతో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 18న ఈ లవ్ బర్డ్స్ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇందుకోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు అంజనా పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 18న ఆమె మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. దాదాపు 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న అంజనా ఇప్పుడు పెద్దల సమక్షంలో ప్రియుడితో కలిసి ఏడడుగులు నడవనుంది. అయితే అంజనాకు కాబోయే భర్త ఎవరన్నది ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే ఈ ప్రేమ పక్షుల ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. చూడముచ్చటి జంట అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అర్జున్ సర్జా. 1988లో కన్నడ నటి నివేదితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారీ యాక్షన్ కింగ్. వీరికి ఐశ్వర్య, అంజనా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా రాణిస్తోంది. అలాగే తన తండ్రి వ్యాపారం, నిర్మాణ సంస్థ పనులు కూడా చూసుకుంటోంది.
ఇక అర్జున్ చిన్న కూతురు అంజనా మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తన ఫ్యామిలీ నేపథ్యానికి భిన్నంగా బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోంది. 2023లో హ్యాండ్ బ్యాగుల తయారీ సంస్థను ప్రారంభించింది అంజనా. ఇక్కడ తయారయ్యే హ్యాండ్ బ్యాగులన్నీ కూడా కేవలం పండ్ల తొక్కలు , కూరగాయల తొక్కలు, నార వంటి వాటితోనే తయారు చేస్తారు. పర్యావరణానికి అనుకూలంగా తయారు చేస్తున్న ఈ హ్యాండ్ బ్యాగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం బిజినెస్ లో రాణిస్తూనే ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యింది అంజనా.
కాబోయే భర్తతో అర్జున్ కూతురు అంజనా..
Action King Arjun’s Daughter #Anjana marriage on Oct 18 💍 https://t.co/dfCgZSvKRf
— Christopher Kanagaraj (@Chrissuccess) October 7, 2026
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన బ్లాస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అభిరామి, ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 75 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
Action King #Arjun’s Daughter #Anjana is getting married on October 16th…..💍 https://t.co/K7fo7F1lOt
— Movie Tamil (@_MovieTamil) October 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




