AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Anandhi: చిన్నప్పటి నుంచే ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన సినిమా వచ్చిదంటే పండగే.. మనసులో మాట చెప్పిన ఆనంది

తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది ఆనంది. లేటెస్ట్ గా ఆమె నటించిన తెలుగు సినిమా 'గరివిడి లక్ష్మీ'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ బయోపిక్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Actress Anandhi: చిన్నప్పటి నుంచే ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన సినిమా వచ్చిదంటే పండగే.. మనసులో మాట చెప్పిన ఆనంది
Actress Anandhi
Basha Shek
|

Updated on: Oct 08, 2026 | 8:47 PM

Share

తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మీ’. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి ‘గరివిడి లక్ష్మీ’ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ ను తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్‌, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. గరివిడి లక్ష్మీగా ఆనంది నటిస్తుండగా, ఆమె తల్లి పాత్రను సీనియర్ హీరోయిన్ రాశి పోషించారు. వీరితో పాటు నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. హీరోయిన్ ఆనంది కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. ఇదే క్రమంలో తాను జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పెద్ద అభిమానినని ఆనంది చెప్పుకొచ్చింది.

‘చిన్నప్పటి నుంచి నాకు పవన్ కల్యాణ్ గారంటే పిచ్చి ఇష్టం. నిజ చెప్పాలంటే చిన్నతనం నుంచే ఆయనే నా క్రష్. వెండితెరపై ఆయన మ్యానరిజమ్‌లు, విలక్షణమైన స్టైల్ నాకెంతో నచ్చుతుంది. ఆయన సినిమా వస్తోందంటే చాలు ఒక పండగ వాతావరణంలా ఉంటుంది. నేను నటిగా ఎదిగాక కూడా పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానం కొంచెం కూడా తగ్గలేదు’ అని ఆనంది పేర్కొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఇప్పడే కాదు గతంలోనూ పవన కల్యాణ్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంది ఆనంది. పవర్ స్టార్ తన ఫేవరెట్ హీరో అని, ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. హీరోయిన్ గా కాకపోయినా ఆయన చెల్లెలి పాత్రలో చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసింది. ఇప్పుడు మరోసారి పవన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిందీ తెలుగమ్మాయి.

ఇవి కూడా చదవండి

‘గరివిడి లక్ష్మీ’ ‘సినిమా ప్రమోషన్లలో ఆనంది..

View this post on Instagram

A post shared by @peoplemediafactory

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిన్నప్పటి నుంచే ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన సినిమా వచ్చిదంటే పండగే
చిన్నప్పటి నుంచే ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన సినిమా వచ్చిదంటే పండగే
ఉద్యోగులకు బాస్ బిగ్ సర్ ప్రైజ్,రూ.43 లక్షల బిఎమ్‌డబ్ల్యూ కార్లు!
ఉద్యోగులకు బాస్ బిగ్ సర్ ప్రైజ్,రూ.43 లక్షల బిఎమ్‌డబ్ల్యూ కార్లు!
అక్టోబర్ నుంచి కొత్త రైల్వే నిబంధనలు.. అది తప్పనిసరి
అక్టోబర్ నుంచి కొత్త రైల్వే నిబంధనలు.. అది తప్పనిసరి
మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్..
మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్..
తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృత
తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృత
అతను నాకు ఐలవ్‌యు చెప్పాడు.. నేను ఒకే చెప్పేశా..!
అతను నాకు ఐలవ్‌యు చెప్పాడు.. నేను ఒకే చెప్పేశా..!
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి సీరియస్!
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి సీరియస్!
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే..
టీ20 ఎఫెక్ట్.. ఏకంగా 12 జట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..!
టీ20 ఎఫెక్ట్.. ఏకంగా 12 జట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..!
నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం