AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Special Buses: దసరాకు ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఛార్జీలపై ఆర్టీసీ పండుగ చేసుకునే వార్త.. ఎగిరి గంతేయండి..

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించాయి. టీజీఎస్‌ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 మందితో కూడిన గ్రూపులకు డోర్ పిక్-అప్ సౌకర్యం కల్పిస్తోంది. గతంలో మాదిరిగా 50 శాతం అదనపు ఛార్జీలు ఉండవు,

Dasara Special Buses: దసరాకు ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఛార్జీలపై ఆర్టీసీ పండుగ చేసుకునే వార్త.. ఎగిరి గంతేయండి..
Apsrtc
Venkatrao Lella
|

Updated on: Oct 08, 2026 | 9:48 PM

Share

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పొరుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు, అలాగే రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కు అత్యధికంగా 1,186 ప్రత్యేక బస్సులను కేటాయించారు. అలాగే బెంగళూరుకు 475, చెన్నైకి 153 బస్సులను నడపనున్నారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాలైన విశాఖపట్నానికి 440, తిరుపతికి 247, రాజమహేంద్రవరానికి 347 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన టికెట్లను ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముందుగానే రిజర్వ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. పండుగ వేళ ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏర్పాట్లు చేపట్టింది.

సాధారణ ఛార్జీలు అమలు

ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమలు చేస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. గతంలో ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేశారు. కానీ ఈ సారి పండక్కి ఇంటికెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ ఊరట కలిగించింది. సాధారణ రోజుల్లో వసూలు చేసే సాధారణ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. ప్రయాణికులపై భారం మోపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.  దసరా ఉత్సవాలు అక్టోబర్ 11న ప్రారంభం కానుండగా.. 20వ తేదీన విజయదశమితో ముగుస్తాయి. దీంతో ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

టీజీఎస్‌ఆర్టీసీ 7 వేల బస్సులు..

ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ దసరా పండుగ సందర్భంగా మొత్తం 7,000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్ఆర్టీసీ పటిష్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ జోన్ల నుంచి వేల సంఖ్యలో అదనపు సర్వీసులను నడుపుతోంది. ఆర్టీసీ అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 3,533 బస్సులు నడపనున్నారు. ఇందులో ఆదిలాబాద్‌కు 431, నిజామాబాద్‌కు 719, కరీంనగర్‌కు 1,175, వరంగల్‌కు 530, ఖమ్మంకు 678 బస్సులు కేటాయించారు. అలాగే, హైదరాబాద్ జోన్ నుంచి 2,155 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇందులో మహబూబ్‌నగర్‌కు 445, మెదక్‌కు 255, నల్గొండకు 815, రంగారెడ్డికి 440 బస్సులు నడపనున్నారు. అక్టోబర్ 25 మరియు 26 తేదీలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఆ తేదీలలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.

Follow Us
దసరాకు ఇంటికెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై పండుగే..
దసరాకు ఇంటికెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై పండుగే..
10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం
10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం
వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన
వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన
సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
మిగిలిన అన్నంతో క్రిస్పీ కట్లెట్స్.. ఎలా చేయాలి అంటే?
మిగిలిన అన్నంతో క్రిస్పీ కట్లెట్స్.. ఎలా చేయాలి అంటే?
చలికాలంలో గుడ్లు తింటే శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి?
చలికాలంలో గుడ్లు తింటే శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
3.3 ఓవర్లలోనే మ్యాచ్‌ క్లోజ్.. 14 బంతుల్లో దూల తీర్చేసిన ప్లేయర్
3.3 ఓవర్లలోనే మ్యాచ్‌ క్లోజ్.. 14 బంతుల్లో దూల తీర్చేసిన ప్లేయర్