లక్షల జీతం వదిలి సినిమాల్లోకి.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్
Rajitha Chanti
Pic credit - Instagram
08 October 2026
హీరోయిన్ శ్రీనిధి ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, పర్సనల్ లైఫ్ గురించి పంచుకున్నారు.
ఒక ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సినీ ప్రపంచంలోకి ఎలా ప్రవేశించారో వివరించారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.
ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత, యాక్సెంచర్‌లో దాదాపు ఒక సంవత్సరం పది నెలల పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేశానని.. కానీ అది తన లైఫ్ కాదని అన్నారు.
నేను ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా మంచిగా పని చేశాను. దట్ మై టీమ్ వజంట్ రెడీ టు లెట్ గో ఆఫ్ మీ. వద్దు, రిజైన్ చేయద్దు, యా, స్టే బ్యాక్ అని అన్నారని చెప్పారు.
నాకు అర్థమైంది దట్ లేదు, ఈ పని నేను అంత ఎంజాయ్ చేయలేదు. స్టిల్ ఐ యామ్ డూయింగ్ ఇట్ విత్ సో మచ్ ప్యాషన్. ఇఫ్ ఐ డూ ద వర్క్ దట్ ఐ రియల్లీ లవ్, ఎంత ప్యాషన్ గా చేస్తాను.
నటనపై పట్ల తనకున్న బలమైన ఆసక్తిని గుర్తించి, ఆమె తన ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి, అందాల పోటీలు, నటన వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేసుకున్నారు.
తన జీవితంలో చాలా తక్కువ విషయాలలో పశ్చాత్తాపపడ్డారని, ఎందుకంటే ఆమె ఎల్లప్పుడూ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటానని.. తనకు పశ్చాతాప్పం లేదని అన్నారు.
ప్రతిరోజు నేను నిద్రలేచినప్పుడు, నటి కావాలని కోరుకునే మిలియన్ల మంది అమ్మాయిలు ఉన్నారు. వారు ఇక్కడ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను తేలికగా తీసుకోలేనని అన్నారు.