AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIR Enumeration Form: ఎస్‌ఐఆర్ ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? నో టెన్షన్.. మార్చుకోవడం ఈజీ..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. బీఎల్వోలు ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే ఏం చేయాలి.. వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

SIR Enumeration Form: ఎస్‌ఐఆర్ ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? నో టెన్షన్.. మార్చుకోవడం ఈజీ..
Sir
Venkatrao Lella
|

Updated on: Jul 16, 2026 | 12:38 PM

Share

కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(SIR) ప్రక్రియ చేపట్టగా.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చేపడుతోంది. ఏపీలో ఈ నెల 24వ తేదీ వరకు ఈ ప్రాసెస్‌ను పొడిగించగా.. తెలంగాణలో ఆగస్ట్ 3 వరకు పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్లు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. చాలామంది ఓటర్లు ఇంకా ఎస్‌ఐఆర్ పూర్తి చేయలేదు. దీంతో ఎమ్యూనరేషన్ ఫారం పూర్తి చేసి తిరిగి ఇచ్చేందుకు గడువు మరింత పొడిగించింది. ఒకవేళ గడువులోగా ఫారం నింపి ఇవ్వకపోతే మీ ఓటు హక్కు కోల్పోవాల్సి ఉంటుంది. అసలు ఎస్‌ఆర్ అంటే ఏంటి..? ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి.?. ఫారం తీసుకునేందుకు బీఎల్వో రాకపోతే ఏం చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

ఎస్ఐఆర్ అంటే ఏంటి..?

ఎస్‌ఐఆర్ అంటే ఓటర్ల జాబితాను పూర్తిగా పున:పరిశీలన చేయడమని అర్థం. దీని ద్వారా నకిలీ ఓటర్లను తొలగించడంతో పాటు అనర్హులైనవారికి గుర్తిస్తారు. డ్లూపికేట్, మరణించిన, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిన వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా అర్హులైనవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈసీ ఈ ప్రక్రియ చేపట్టింది.

బీఎల్వో ఇంటికి రాకపోతే ఏం చేయాలి..?

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం అందిస్తారు. ఇందులో మీ పేరు, ఓటర్ ఐడీ, అడ్రస్, తల్లిదండ్రుల పేరు లాంటివి నింపి పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తిరిగి బీఎల్వో ఇంటికి వచ్చినప్పుడు అందించాలి. బీఎల్‌వో తిరిగి తీసుకునేందుకు ఇంటికి రాకపోతే https://voters.eci.gov.in పోర్టల్ లేదా ఈసీఐ (ECI) యాప్ ECINET ద్వారా మీ బీఎల్‌ఓ ఫోన్ నెంబర్ గుర్తించి వారిని సంప్రదించవచ్చు. ఇక ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్‌ నెంబర్1950 నంబర్‌ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

BLO వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే ఏం చేయాలి..?

SIR ప్రక్రియలో భాగంగా BLOలు ప్రతి ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శించాల్సి ఉంటుంది. ఒక పర్యటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోతే.. మళ్లీ బీఎల్వో వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫారం సేకరించవచ్చు. లేదా వెబ్‌సైట్‌ను తనిఖీ చేసి ఫోన్ ద్వారా BLOను సంప్రదించవచ్చు.

వివరాలు తప్పుగా రాస్తే ఏం చేయాలి..?

ఎమ్యూనరేషన్ ఫారంలో వివరాలు తప్పుగా నింపినా, చిరిగిపోయినా, లేదా మరే ఇతర కారణం చేతనైనా ఉపయోగించలేని స్థితిలో ఉన్నా అవసరాన్ని బట్టి BLO దాని స్థానంలో మరొకటి అందిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us