AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం 45 పైసలు కడితే చాలు.. రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. ఇందులో చేరడం అస్సలు మర్చిపొవద్దు..

Indian Railway: ఐఆర్సీటీసీ రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు మీరు కేవలం 45 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల ప్రయాణ బీమాను పొందవచ్చు. ప్రమాదంలో మరణం, శాశ్వత వైకల్యం, పాక్షిక వైకల్యం, ఆసుపత్రి ఖర్చులకు ఇది వర్తిస్తుంది. భారత పౌరులకు ఇది వర్తిస్తుంది. ఎలా అంటే..

కేవలం 45 పైసలు కడితే చాలు.. రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. ఇందులో చేరడం అస్సలు మర్చిపొవద్దు..
Irctc
Venkatrao Lella
|

Updated on: Oct 03, 2026 | 8:50 PM

Share

భారతీయ రైల్వేలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ముఖ్యమైన సదుపాయాన్ని అందిస్తోంది. ప్రయాణ బీమా పథకాన్ని ఐఆర్‌సీటీసీ అమలు చేస్తోంది. కేవలం 45 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల బీమా కవరేజీ పొందవచ్చు. ఇది మీ రైలు ప్రయాణాలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ బీమా పాలసీ రైలు ప్రయాణాలలో సంభవించే ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది.  రైలు ప్రమాదంలో గాయాలై ఆస్పత్రిలో చేరినప్పుడు ప్రయాణికులకు రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇక ప్రమాదం కారణంగా పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షల వరకు అందుతుంది. ప్రమాదంలో శాశ్వతంగా వైకల్యం చెందితే రూ.10 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణిస్తే.. నామినీకి రూ.10 లక్షల వరకు అందిస్తారు.

ఈ బీమా పథకం భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని పొందగలరు.  ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సీటు బుక్ చేయకపోతే ఈ బీమా వర్తించదు. ఐదు నుండి 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్లు బుక్ చేసినట్లయితే వారికి కూడా బీమా వర్తిస్తుంది. ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ బీమా ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత ప్రయాణికుడికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా బీమా సమాచారం అందుతుంది. ఈ సమాచారంలో పాలసీ నంబర్, ఇతర ముఖ్య వివరాలు ఉంటాయి. ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ వివరాలలో ఈ పాలసీ సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు.

బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నామినీ వివరాలను పొందుపర్చాలి. నామినేషన్ సమాచారం నింపకపోతే.. క్లెయిమ్ విషయంలో కుటుంబసభ్యులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది ప్రక్రియను క్లిష్టతరం చేయవచ్చు. అందువల్ల బీమా ప్రయోజనాలు సకాలంలో, సరైన వ్యక్తికి చేరాలంటే నామినీ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయడం మంచిది. ఈ చిన్న ప్రీమియంతో లభించే భారీ కవర్‌తో మీ రైలు ప్రయాణాలకు భద్రత పొందవచ్చు. ఇండియన్ రైల్వేస్, ఐఆర్సీటీసీ ఈ బీమా సౌకర్యం కల్పిస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ కోరుతోంది. కేవలం 45 పైసలకు రూ.10 లక్షల కవరేజీ పొందవచ్చు. ప్రమాదవశాత్తూ జరిగే ఘటనలకు దీని ద్వారా రక్షణ పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

Follow Us
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో
నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో