AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ రెండు పనులు వెంటనే చేయకపోతే సమస్యలే.. మీ డబ్బులన్నీ బంద్..

పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు ఇలాంటి సమస్యలు లేకుండా పొందాలంటే ఫొటోను అప్ లోడ్ చేయడం తప్పనిసరి. దీని వల్ల పీఎఫ్ క్లెయిమ్స్ సమయంలో ఇబ్బందులు ఉండవు. అలాగే ఇతర సర్వీసుల సమయంలో కూడా అవాంతరాలు ఏర్పడవు. ఎలా అప్ లోడ్ చేయాలనేది ఇఫ్పుడు చూద్దాం.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ రెండు పనులు వెంటనే చేయకపోతే సమస్యలే.. మీ డబ్బులన్నీ బంద్..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jul 16, 2026 | 1:00 PM

Share

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. పీఎఫ్ పోర్టల్‌లో ఈ-నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడం, ప్రొఫైల్ ఫోటోను  అప్‌లోడ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చేయకపోతే పీఎఫ్ క్లెయిమ్స్, పెన్షన్, జీవిత బీమా సౌకర్యం పొందటంలో అవాంతరాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రొఫైల్ ఫోటోను ఆన్‌లైన్ వెరిఫికేషన్ సమయంలో ఉపయోగిస్తారు. ప్రొఫైల్ ఫోటోను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కానప్పటికీ.. ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా వేగవంతంగా సేవలు పొందవచ్చు. ఫొటో, ఇ-నామినేషన్‌ను పూర్తి చేయనివారు ఆన్‌లైన్ EPFO ​​సేవలను పొందటంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.

ప్రొఫైల్ ఫోటోను ఎలా అప్‌డేట్ చేయాలి..?

-EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కు వెళ్లండి

– మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి

-ఆ తర్వాత మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయండి

-ఆ తర్వాత హోమ్ పేజీలో ‘ప్రొఫైల్’ లేదా ‘వ్యూ’ విభాగంపై క్లిక్ చేయండి

-మీ ప్రొఫైల్ ఫోటోను అప్‌లోడ్ చే లేదా అప్‌డేట్ చేనే ఆప్షన్ ఎంచుకోండి

– లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అప్‌లోడ్ చేసి సేవ్ చేయండి

-ఆన్‌లైన్‌లో ఇ-నామినేషన్ లేదా పీఎఫ్ క్లెయిమ్ దాఖలు చేసే ముందు, మీ ప్రొఫైల్‌లో అప్‌డేట్ చేసిన ఫోటో సరిగ్గా కనబడుతోందో లేదో నిర్ధారించుకోండి

ఫొటో, నామినీ డీటైల్స్ అప్ లోడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఇవే..

అదనంగా సరైన వ్యక్తిగత సమాచారంతో (ప్రొఫైల్ ఫోటోతో సహా) ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం ద్వారా సభ్యులు ఎలాంటి అంతరాయం లేకుండా వివిధ ఆన్‌లైన్ EPFO ​​సేవలను పొందవచ్చు. ఖాతాదారుడు నామినీని ఎంచుకోకపోతే వారి కుటుంబ సభ్యులు డబ్బును క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు. అలాగే మరిన్ని పత్రాలు అవసరం కావచ్చు. EPF ఇ-నామినేషన్‌ను చెల్లుబాటు అయ్యేలా చేయడానికి, సభ్యులు తప్పనిసరిగా ఇ-సైన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి. సరైన నామినేషన్, జమ చేయబడిన EPF బ్యాలెన్స్‌తో పాటు, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కింద లభించే ప్రయోజనాలు కూడా అర్హులైన లబ్ధిదారునికి సజావుగా బదిలీ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇక పొటో, ఈ నామినేషన్‌నే కాకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటైల్స్ అప్డేట్ చేయడం కూడా ముఖ్యం. పీఎఫ్ క్లెయిమ్స్ ఎలాంటి సమస్యలు లేకుండా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. అన్నీ వివరాలు అప్డేట్ చేయడం వల్ల పీఎఫ్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడదు.

Follow Us