Gold Prices: 2027 నాటికి బంగారం ధరలు అంతకు పెరుగుతాయా..? బ్లాస్టింగ్ లెక్కలివే..
2027లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయనే బాబా వంగ పేరుతో వైరల్ అవుతున్న అంచనాలను ఈ కథనం విశ్లేషిస్తుంది. ఆర్థిక సంక్షోభం, బ్యాంకింగ్ వ్యవస్థలపై నమ్మకం తగ్గితే బంగారం పెట్టుబడిగా మారుతుందని ప్రచారం. అయితే, ఈ అంచనాలకు బాబా వంగ భవిష్యవాణిలో ఆధారాలు లేవు. జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ 2027 నాటికి ఔన్సు బంగారం 6300 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.

2027లో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయంటూ బాబా వంగ చెప్పిన జోస్యం వైరల్ అవుతోంది. బాబా వంగ ఎప్పుడో చనిపోయినప్పటికీ.. ఆమె పేరు మీద పలు ప్రెడిక్షన్‌లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుత దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, నగదు కొరత ఏర్పడి, సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలపై ప్రజల నమ్మకం తగ్గితే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారని ప్రచారం జరుగుతోంది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఈ అంచనాల ప్రకారం.. బంగారం ధరలు త్వరలో 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 2027 నాటికి భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.62 లక్షల నుంచి రూ.2.82 లక్షల మధ్యకు చేరుతుందని అంచనాలు కడుతున్నారు. ప్రముఖ ఆర్థిక సంస్థలు సైతం 2027లో బంగారం ధరల పెరుగుదలపై అంచనాలను వెల్లడించాయి. జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం.. 2026 నాలుగో త్రైమాసికంలో ఔన్సు బంగారం ధర 6000 డాలర్లు ఉండవచ్చని, 2027 చివరి నాటికి 6300 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది.
బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పడిపోతుండగా.. అక్టోబర్ 2వ తేదీన శుక్రవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1040కి పెరగడంతో రూ.1,50,280కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,37,750కి చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,450కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,900 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరలు ఇవే..
అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై ఇవాళ రూ.5 వేలు పెరిగింది. నిన్న కిలో వెండి ధర రూ.2.40 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో ఇవే ధరలు ఉండగా.. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది.
రాబోయే రోజుల్లో పెరుగుతాయా..?
అయితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందనే ప్రచారం జరుగతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, రూపాయి బలహీనపడుతున్న క్రమంలో ధరలు ఆకాశాన్నంటే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే కారణంతో ఇప్పుడు బంగారం కొని పెట్టుకుంటున్నారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు రానున్న క్రమంలో పసిడికి డిమాండ్ పెరగనుంది.
