AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Custard Recipe: డయాబెటిక్ పేషెంట్లూ హాయిగా తినొచ్చు.. చక్కర లేకుండా ఫ్రూట్ కస్టర్డ్ ఇంత టేస్టీనా..

వేసవిలో చల్లచల్లని ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అయితే, మనం వాడే కస్టర్డ్ పౌడర్ చక్కెర వల్ల రుచి దక్కినా ఆరోగ్యం దెబ్బతింటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినేయొచ్చు. పిల్లలకు ఇష్టమైన ఈ డెజర్ట్‌ను మరింత పౌష్టికంగా మార్చడం ఎలా? ఎటువంటి కృత్రిమ పౌడర్లు వాడకుండా, కేవలం మఖానా డ్రై ఫ్రూట్స్‌తో క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Fruit Custard Recipe: డయాబెటిక్ పేషెంట్లూ హాయిగా తినొచ్చు.. చక్కర లేకుండా ఫ్రూట్ కస్టర్డ్ ఇంత టేస్టీనా..
Sugar Free Fruit Custard Recipe
Bhavani
|

Updated on: Mar 16, 2026 | 12:54 PM

Share

ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఈ కాలంలో, రుచికరమైన స్వీట్స్ ను చక్కెర లేకుండా తయారు చేసుకోవడం ఒక స్మార్ట్ పద్ధతి. మఖానా (తామర గింజలు), బాదం, జీడిపప్పులను ఉపయోగించి చిక్కటి క్రీమ్ ఎలా తయారు చేయాలి? కుంకుమపువ్వు, తేనెతో ఆ కస్టర్డ్‌కు సహజమైన రంగు, రుచి ఎలా తీసుకురావాలి? అనే ఆసక్తికర విషయాలను ఈ రెసిపీలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

మఖానా (తామర గింజలు): 1 కప్పు

బాదం, జీడిపప్పు: ఒక్కొక్కటి అర కప్పు

పాలు: గోరువెచ్చనివి (మిశ్రమానికి సరిపడా)

తేనె: రుచికి తగ్గట్టుగా (చక్కెరకు బదులుగా)

కుంకుమపువ్వు: కొద్దిగా (సహజ రంగు కోసం)

పండ్లు: ఆపిల్, ద్రాక్ష, సపోటా, అరటిపండు, దానిమ్మ.

తయారీ విధానం

ఒక గిన్నెలో ఒక కప్పు మఖానా, అర కప్పు బాదం, జీడిపప్పు తీసుకోండి. అందులో ఒక కప్పు గోరువెచ్చని పాలు పోయండి.

ఇప్పుడు ఆ పాలలో కుంకుమపువ్వు రేకులు మరియు స్వచ్ఛమైన తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని 15 నుండి 20 నిమిషాలు పక్కన పెట్టండి. దీనివల్ల డ్రై ఫ్రూట్స్ పాలను పీల్చుకుని మెత్తగా మారుతాయి.

పాలలో నానిన ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేయండి. ఇది కస్టర్డ్ పౌడర్ లాంటి చిక్కటి క్రీమీ టెక్స్చర్ ను ఇస్తుంది.

ఒక పెద్ద గిన్నెలో మీకు నచ్చిన పండ్ల ముక్కలను తీసుకోండి. వాటిపై తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ క్రీమ్‌ను పోయండి. పండ్లకు క్రీమ్ బాగా పట్టేలా మెల్లగా కలపండి.

చివరగా దానిమ్మ గింజలు, పిస్తా ముక్కలతో గార్నిష్ చేయండి.

చిన్న చిట్కా: ఈ కస్టర్డ్‌ను ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే హోటల్ స్టైల్ రుచి వస్తుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ అలర్జీ ఉంటే వైద్యుని సలహా తీసుకోండి.

Follow Us