AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న పుష్ప ఫేమ్ కేశవ

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ పీర్ దర్గాను సెలబ్రిటీలు నిత్యం దర్శించుకుంటూ ఉంటారు. వారి సినిమా విడుదల సమయాలలో, అలాగే ఏదన్నా కొత్త సినిమా ప్రారంభిస్తున్న సమయంలో చాలామంది సినీ తారలు దర్గాను దర్శించు కోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు పుష్ప సినిమా ఫేమ్ కేశవ ఈరోజు దర్గాను దర్శించుకున్నాడు.

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న పుష్ప ఫేమ్ కేశవ
Photo
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Apr 16, 2026 | 10:10 PM

Share

కడప జిల్లాలోని పవిత్ర అమీన్ పీర్ దర్గాను పుష్ప సినిమాలో నటించిన జగదీష్ అలియాస్ కేశవ దర్గాను దర్శించుకున్నారు. ఇప్పటివరకు కడప అమీన్ పీర్ దర్గాను మూడుసార్లు దర్శించుకున్నారని ఎంతో పవిత్రమైన ఈ దర్గాను దర్శించుకోవడం మనసుకి ప్రశాంతంగా ఉందని కేశవ అన్నాడు. రేపు తాను నటించిన తెరచాప సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా ఈరోజు దర్గాను దర్శించుకున్నట్లు కేశవ తెలిపాడు. దర్గాకు విచ్చేసిన కేశవకు దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను తెలియచెప్పారు. సెలబ్రిటీలకు కడప దర్గా ఒక నమ్మకం అందుకే ప్రతి ఒక్క సెలబ్రిటీ దర్గాను సందర్శించి చాదర్ సమర్పిస్తారు దానివలన మంచి విజయాలు సాధిస్తారని ఒక నమ్మకం సెలబ్రిటీలకు ఉంది.

Follow Us