స్టార్ హీరోల బాడీగార్డ్స్ నెల జీతమెంతో తెలుసా? షాకింగ్ విషయాలు చెప్పిన షారుఖ్ ఖాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు తమకు రక్షణగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటారు. అయితే ఈ బాడీ గార్డ్స్ జీతం గురించి అప్పుడప్పుడు ఆసక్తికర వార్తలు కనిపిస్తుంటాయి. ఇంతకీ, ఈ బాడీగార్డ్‌లు ఎంత జీతం తీసుకుంటారో మీకు తెలుసా?ఇప్పుడు ఇదే విషయంపై షారుఖ్ ఖాన్ మాజీ బాడీగార్డ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సినీ ప్రముఖులకు భద్రత చాలా అవసరం. ప్రభుత్వం కొంతమంది సినీ తారలకు భద్రత కల్పిస్తున్నప్పటికీ, దాదాపుగా స్టార్ నటీనటులందరూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటారు. భారీ దేహాలు గల వీరు తమ యజమానులకు రక్షణ కల్పించడమే ప్రధాన విధిగా పనిచేస్తుంటారు. మరి ఇంతకీ, ఈ బాడీగార్డులు ఎంత జీతం తీసుకుంటారో మీకు తెలుసా? ఈ విషయంపై షారుఖ్ ఖాన్ మాజీ బాడీగార్డ్ ఇప్పుడు మాట్లాడారు. కొంతమంది స్టార్ నటుల బాడీగార్డ్‌లు కూడా చాలా ఫేమస్ అవుతారు. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా, షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి గురించి వార్తలు వినిపిస్తుంటాయి. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా సంవత్సరానికి సుమారు రూ. 2.50 కోట్లు సంపాదిస్తాడని అంటారు. షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ సంవత్సరానికి రూ. 3 కోట్లు సంపాదిస్తాడని ప్రచారంలో ఉంది. ఈ వార్తలపై షారుఖ్ ఖాన్ మాజీ సెక్యూరిటీ మేనేజర్ యాసిన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
షారుఖ్ ఖాన్‌తో పనిచేసిన మాజీ సెక్యూరిటీ మేనేజర్ యాసిన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ, సెక్యూరిటీ గార్డులకు సంవత్సరానికి రూ. 3-4 కోట్లు చెల్లిస్తారనే వార్తలు దాదాపు అవాస్తవమని అన్నారు. ‘ బాధ్యతల స్థాయిని బట్టి వారికి జీతం చెల్లిస్తారు. చాలా మంది బాడీగార్డులు నెలకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు జీతం పొందుతారు. మీరు షూటింగ్‌లకు, బహిరంగ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు కొంచెం ఎక్కువ జీతం వస్తుంది’ అని ఆయన అన్నారు.
సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా, షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్‌లకు జీతం ఎక్కువగానే ఇస్తున్నప్పటికీ, వారు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, నటుల కుటుంబాలలో అంతర్భాగంగా ఉన్నారు. దశాబ్దాల పాటు తెర వెనుక నటులుగా పనిచేసిన తర్వాత వారు పొందే గౌరవం, ప్రత్యేక హక్కులు అపారమైనవి అని యాసిన్ అన్నారు. కాగా షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. అతను బహిరంగ కార్యక్రమాలలోనే కాకుండా, షారుఖ్‌తో పాటు అతని విదేశీ పర్యటనలలో కూడా కింగ్ ఖాన్ వెంట ఉంటాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




