AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Tips: సక్సెస్ కావాలంటే ముందుగా ఇది తెలుసుకోండి.. ఈ రహస్య సూత్రాలు మీకోసం

ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు, కానీ చాలా మంది దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోరు. మార్పు అనేది బయటి నుండి కాకుండా మనలోపల నుంచే మొదలవ్వాలి. మనిషి తనను తాను లోపల నుండి బలపరుచుకోవాలి. దీని కోసం ఐదు కీలకమైన జీవిత సత్యాలను మీరు తప్పని సరిగా తెలుసుకోవాలి.

Phani CH
|

Updated on: Apr 16, 2026 | 8:15 PM

Share
 స్వీయ పరిశీలన: రోజూ అద్దం ముందు నిలబడినప్పుడు కేవలం నీ ముఖం మాత్రమే కాకుండా, నీ లోపల ఉన్న మనిషిని కూడా చూడటం నేర్చుకో. నీ తప్పు ఏమిటో నీకు తెలియాలి. ఇతరులను వేలెత్తి చూపించే ముందు నీ చేతిలోని లోపాలను సరిదిద్దుకో. నిన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్న రోజే నీ ఎదుగుదల మొదలవుతుంది.

1 / 5
నిరంతర జ్ఞానార్జన: ఒక కత్తిని వాడకపోతే దానికి తుప్పు పడుతుంది. మన మెదడు కూడా అంతే. చదువు అనేది పాఠశాలతో అయిపోదు. అది ప్రాణం ఉన్నంతవరకు సాగాలి. రోజూ ఒక కొత్త విషయం నేర్చుకో, ఒక మంచి పుస్తకం చదువు. జ్ఞానమే నీ అసలైన ఆస్తి. అది ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా రారాజులాగే జీవించగలడు.

2 / 5
సమయ పాలన: పోయిన డబ్బును సంపాదించవచ్చు, కానీ పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము. ఒక క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. ఉదయాన్నే నిద్రలేవడం, నీ పనులను ఒక పద్ధతి ప్రకారం చేసుకోవడం అలవాటు చేసుకో. సమయాన్ని గౌరవించే వాడిని ఆ సమయమే ఒక గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెడుతుంది.

3 / 5
ఓటమిని అంగీకరించడం: చాలామంది ఓడిపోగానే భయపడి ఆగిపోతారు. కానీ గుర్తుంచుకో, పసిబిడ్డ నడక నేర్చుకునేటప్పుడు వందసార్లు కింద పడిపోతుంది. అప్పుడే ఆ బిడ్డకు ఎలా నిలబడాలో తెలుస్తుంది. ఓటమి అనేది నీ అంతం కాదు. అది నీ తదుపరి విజయానికి పునాది. ధైర్యంగా ముందడుగు వేయ్.

4 / 5
మంచి వ్యక్తిత్వం: నువ్వు ఎంత ఎదిగినా నీ మూలాలను మర్చిపోకు. ఎదుటి మనిషితో ఎలా మాట్లాడుతున్నావు, ఎంత మర్యాదగా ఉన్నావు అనేదే నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. గొప్పవాడిగా ఎదగడం కంటే ఒక మంచి మనిషిగా పేరు తెచ్చుకోవడం కష్టం. అది సాధించిన రోజే నువ్వు నిజమైన విజేతవి.

5 / 5
Follow Us