ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.. ఈ బ్యూటీ క్రేజ్ చూస్తే
Rajitha Chanti
Pic credit - Instagram
16 April 2026
అనంతిక కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకుంది. సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్న అనంతిక, నటనను కేవలం వృత్తిగా కాకుండా ఒక ఫ్యాషన్‌గా భావిస్తుందట. '8 వసంతాలు' సినిమాలో ఆమె పాత్ర ఎంతో వైవిధ్యంగా అలరించింది.
అనంతిక కేవలం అందంతోనే కాకుండా తన అభినయంతో కూడా మెప్పించగలదని '8 వసంతాలు' సినిమాతో నిరూపించింది. ఈ మూవీ తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.
తాజాగా కేరళ సాంప్రదాయ పండుగ 'విషు' సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకున్న ప్రత్యేక ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
తన సహజసిద్ధమైన అందంతో, సాంప్రదాయక కట్టుబొట్టుతో ఆమె మెరిసిపోతున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలో ఉగాది పండుగలాగే 'విషు'ను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
ఈ సందర్భంగా అనంతిక కేరళ స్టైల్ వైట్ అండ్ గోల్డ్ కసావు శారీ ధరించి పక్కా మలయాళీ కుట్టిలా కనిపిస్తోంది. చేతిలో కృష్ణ విగ్రహం, కొబ్బరి బోండాలతో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు "అచ్చం దేవకన్యలా ఉందంటూ" కామెంట్లతో ముంచెత్తుతున్నారు. అనంతిక ప్రయాణం 'రాజమండ్రి రోజ్ మిల్క్'తో మొదలైంది.
'మ్యాడ్' చిత్రంతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన '8 వసంతాలు' సినిమాలో 'శుద్ధి అయోధ్య' అనే పాత్రలో ఆకట్టుకుంది.