మూడు బిల్లులు.. ఒకటే సంకల్పం.. కోటా లెక్కపై పీటముడి..!
2026 ఏప్రిల్ 16.. ఈ తేదీ చానాకాలం యాదుంటది. రాబాయే రెండుమూడు తరాలు బరాబర్ మాట్లాడుకుంటాయి.. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పార్టీల తలరాతను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన రెండు నిర్ణయాలకు మోదీ సర్కార్ పెట్టిన ముహూర్తం ఇది. మొదటిది, లోక్‌సభలో సీట్ల పెంపు, ఆ పెంచిన సీట్లలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయింపు. రెంటికి రెండూ హిస్టరీని బ్రేక్ చేసే నిర్ణయాలే. కానీ, ఈ రెండింటికీ ముడిపెట్టి, ఒకటే గాటనకట్టి, చర్చిద్దాం, ఓటేసి ఆమోదించుకుందాం అనడమే, విపక్షానికి రుచించడం లేదు. ఆ సంఘర్షణకే అద్దం పెట్టింది పార్లమెంట్ స్పెషల్ సెషన్. మరి, ధిక్కరించిందెవరు.. గట్టిగా తిప్పికొట్టిందెవరు? ఎవరి వాదనలో ఎంత పస..? హీరో ఆఫ్ ది డేవన్ ఎవరు..?

1976 తర్వాత ఏ ప్రధానమంత్రీ టచ్ చెయ్యని డీలిమిటేషన్ ప్రక్రియను 50 ఏళ్ల తర్వాత చేతికందుకున్నారు ప్రధాని మోదీ. తారీఖ్ పే తారీఖ్, తారిక్ పే తారిఖ్.. వాయిదా పడుతూ 30 ఏళ్లుగా అటకెక్కి కూర్చున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా దుమ్ము దులిపి, టేబుల్ మీద పెట్టింది ఎన్‌డీఏ సర్కార్. కానీ, ఈ రెండింటి ఫ్యూచర్‌పై మళ్లీ మిస్టరీగా మారిందా? ఎన్‌డీఏ, ఇండీ కూటముల మైండ్‌గేమ్ ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం.. తమిళనాడు, బెంగాల్ లాంటి ఎన్‌డీఏ హార్డ్‌కోర్ వ్యతిరేక రాష్ట్రాల్లో డీలిమిటేషన్ బిల్లు కాగితాలు మంటల్లో తగలడుతుంటే.. అవే బిల్లు కాగితాలు దేశ అత్యున్నత సభ టేబుళ్లపై సగర్వంగా మెరిశాయి. జనాభా లెక్కింపును, బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను తప్పించుకోడానికి ప్రభుత్వం ఎస్కేపిజం పాలసీతో ముందుకెళ్తోందని అపోజిషన్ పార్టీ అంటోంది. మీకు పెద్ద మనసు లేదు, అందుకే, మహిళా సాధికారతను స్వాగతించడం లేదని అధికారపక్షం పెట్టిన శాపనార్థాలతో మొదలైంది.. ది హిస్టారికల్ డే ఇన్ పొలిటికల్ ఇండియా.. ఏప్రిల్ సిక్స్‌టీన్ 2016. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); ఉదయం 11 గంటలకు న్యాయశాఖ మంత్రి, హోంమంత్రి మూడు బిల్లులను లోక్‌సభ ముందు పెట్టి, చర్చిద్దాం రండి అని పిలుపునిచ్చారు. కానీ, బిల్లుల ప్రవేశాన్నే వ్యతిరేకించాయి విపక్షాలు. డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టాయి. స్పీకర్ ఓం బిర్లా ఓకే చెప్పడంతో డివిజన్ ఓటింగ్ షురూ ఐంది. బిల్లుకు మద్దతుగా 251 మంది, వ్యతిరేకంగా 185 మంది ఓటేశారు. 66 ఓట్ల మెజార్టీ...
