16 April, 2026
Subhash
ఫ్రిజ్ తలుపుకు ఉండే రబ్బర్ సరిగ్గా అతుక్కుంటుందో లేదో చూడండి. ఇది వదులైతే లోపలి చల్లని గాలి బయటకు వెళ్లిపోయి.కూలింగ్ తగ్గుతుంది.
ఫ్రిజ్ వెనుక లేదా కింద భాగంలో ఉండే కండెన్సర్ కాయిల్స్‌పై దుమ్ము పేరుకుపోతే వేడి సరిగ్గా బయటకు వెళ్లదు. ఏడాదికి కనీసం రెండుసార్లు బ్రష్‌తో శుభ్రం చేయాలి.
ఫ్రిజ్‌ను గోడకు మరీ దగ్గరగా ఉంచకూడదు. గోడకు, ఫ్రిజ్ వెనుక భాగానికి మధ్య కనీసం 6 అంగుళాల ఖాళీ ఉండాలి. దీనివల్ల గాలి ప్రసరణ బాగుండి కంప్రెసర్ వేడెక్కకుండా ఉంటుంది.
ఋతువును బట్టి ఉష్ణోగ్రతను మార్చాలి. వేసవిలో కూలింగ్ సెట్టింగ్‌ను కొంచెం పెంచాలి. సాధారణంగా ఫ్రిజ్ లోపల 3°C నుండి 5°C ఉష్ణోగ్రత ఉండటం ఉత్తమం.
ఫ్రిజ్ లోపల గాలి వెళ్లే మార్గాలను ఆహార పొట్లాలు లేదా డబ్బాలతో మూసివేయకండి. గాలి ఫ్రిజ్ అంతా ధారాళంగా ప్రసరిస్తేనే కూలింగ్ సమానంగా ఉంటుంది. అలాగే ఫ్రిజ్‌ను మరీ ఎక్కువగా నింపేయకండి.
వండిన వెంటనే వేడివేడి గిన్నెలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అవి చల్లబడిన తర్వాతే లోపల ఉంచాలి. వేడి వస్తువుల వల్ల ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత పెరిగి, కంప్రెసర్‌పై భారం పడుతుంది.
ఫ్రిజ్ తలుపును పదే పదే తెరవడం లేదా ఎక్కువ సేపు తెరిచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలికి చేరుతుంది. దీనివల్ల లోపల మంచు పేరుకుపోయి కూలింగ్ సామర్థ్యం తగ్గుతుంది.
మీది మాన్యువల్ డిఫ్రాస్ట్ ఫ్రిజ్ అయితే, ఫ్రీజర్‌లో మంచు ఎక్కువగా పేరుకుపోకుండా చూసుకోండి. మంచు 0.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే వెంటనే డిఫ్రాస్ట్ చేయండి. ఇది కూలింగ్‌ను పెరుగుతుంది.