TG TET 2024 Exam: రేప‌ట్నుంచి టెట్ 2024 ప‌రీక్షలు ప్రారంభం.. అభ్యర్ధులకు కీలక మార్గదర్శకాలు

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2024 డిసెంబర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విద్యాశాఖ విడుదల చేసింది. పేపర్ 1, పేపర్ 2 పరీక్షలను రోజుకు రెండు సెషన్ల చొప్పున మొత్తం 20 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు విద్యాశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటంటే..

TG TET 2024 Exam: రేప‌ట్నుంచి టెట్ 2024 ప‌రీక్షలు ప్రారంభం.. అభ్యర్ధులకు కీలక మార్గదర్శకాలు
TG TET 2024 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2025 | 12:30 PM

హైదరాబాద్‌, జనవరి 1: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) పరీక్షలు రేపట్నుంచి (జనవరి 2) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపట్నుంచి జనవరి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. టెట్ ప‌రీక్షల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2.75 ల‌క్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే టెట్ హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో కూడా విద్యాశాఖ ఉంచింది. అధిక మంది హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆయా తేదీల్లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష, జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్‌ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం ప‌ది రోజుల పాటు 20 సెష‌న్లలో ఈ ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు కొన్ని ముఖ్య మార్గదర్శకాలను సూచించింది. అవేంటంటే..

ఇవి కూడా చదవండి

టెట్ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధ‌న‌లు ఇవే..

  • ఉద‌యం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే అభ్యర్థుల‌ను ఉద‌యం 7.30 నుంచి ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తిస్తారు. మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే వారిని మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి లోనికి అనుమ‌తిస్తారు.
  • ఇక ప‌రీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రం గేట్లను క్లోజ్ చేయ‌నున్నారు. ఉద‌యం సెష‌న్‌లో ఉదయం 8.45 గంటలకు, మ‌ధ్యాహ్నం సెష‌న్‌లో 1.45 గంట‌ల‌కు గేట్లను క్లోజ్‌ చేస్తారు.
  • అభ్యర్థులు త‌ప్పనిస‌రిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఏదైనా గుర్తింపు కార్డు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓట‌ర్ ఐడీలలో ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి.
  • స్మార్ట్ వాచీల‌తో పాటు ఎలాంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు పరీక్ష కేంద్రాల్లోకి అనుమ‌తి లేదు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?