AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గచ్చిబౌలి పబ్‌లో పోలీసుల సీక్రెట్ ఆపరేషన్‌.. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌!

నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు పబ్బులు, క్లబ్సులపై గట్టి నిఘా పెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఓ పబ్ లో ఆకస్మిక తనిఖీలు చేయగా ఏకంగా 8 మంది డ్రగ్స్ సేవించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు పబ్బులకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో జీరో-టాలరెన్స్ పాలసీ అమలులో ఉన్నందున్న ఎట్టి పరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాల వినియోగాన్ని సహించేది లేదని పోలీస్ అధికారులు హెచ్చరించారు..

Hyderabad: గచ్చిబౌలి పబ్‌లో పోలీసుల  సీక్రెట్ ఆపరేషన్‌.. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌!
TGANB operation
Srilakshmi C
|

Updated on: Dec 31, 2024 | 10:54 AM

Share

గచ్చిబౌలి, డిసెంబర్‌ 31: గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 25 మందిని తనిఖీ చేయగా వారిలో.. 8 మందికి డ్రగ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధి మాదాపూర్‌లో ఆదివారం రాత్రి క్వాక్‌ పబ్‌లో టీన్యాబ్‌, ఎస్‌వోటీ, గచ్చిబౌలి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. TGANB ఆధ్వర్యలో 22 మందితో కూడిన ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్‌ చేపట్టింది. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్, ఎలక్ట్రానిక్ అండ్‌ ఫిజికల్‌ నిఘా, అలాగే డ్రగ్స్ వినియోగించే వ్యక్తులను గుర్తించడానికి శిక్షణ పొందిన స్పాటర్‌లతో ఈ ఆపరేషన్ ప్లాన్ చేసినట్లు TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య చెప్పారు.

కొండాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాక్‌ పబ్‌లో ఆదివారం రాత్రి బెన్‌ భూమర్‌ భ్లూమ్‌ లైవ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు వచ్చిన వారిలో 25 మంది నుంచి పోలీసులు డ్రగ్స్‌ నిర్ధారణ నమూనాలు సేకరించారు. వారిలో మూత్ర శాంపిల్స్‌లో నలుగురికి, సేలైవా శాంపిల్స్‌లో మరో నలుగురికి మొత్తం 8 మందికి ఈ తనిఖీల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ అధునాతన డ్రగ్ డిటెక్షన్ కిట్‌లను పోలీసులు వినియోగించారు. మూత్రం, లాలాజల పరీక్ష కిట్‌ల ద్వారా త్వరిత గతిన ఫలితాలు రాబట్టారు. పాజిటివ్‌ వచ్చిన 8 మందిలో నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే డ్రగ్స్‌ నిర్ధారణ అయినప్పటికీ ఈ పబ్‌లో పోలీసులకు ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదు. నిందితులపై ఎన్‌డీపీఎస్‌ 27 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు సందీప్‌ శాండిల్య తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈవెంట్‌లు, పార్టీల వద్ద ఇలాంటి కఠినమైన తనిఖీలు నిర్వహిస్తామని TGANB హెచ్చరించింది. ఎవరైనా డ్రగ్స్ సేవించినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ జీరో-టాలరెన్స్ పాలసీకి కట్టుబడి ఉందని, ఇక్కడ డ్రగ్స్‌కు తావు లేదని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..