Malla Reddy: మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

Malla Reddy: మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Dec 31, 2024 | 4:15 PM

మల్లారెడ్డి.. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.. పాలమ్మిన, పూలమ్మిన అనే డైలాగ్‌తో పాపులర్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం ఎదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఒక్కొసారి అయన మాట్లాడినా మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. కొన్ని సార్లు ఆయన డైలాగ్‌లు నెటింట్లో చక్కర్లు కొడుతుంటాయి.

మల్లారెడ్డి.. ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. వివిధ వేడుకల్లో పాల్గొని డ్యాన్స్‌లతో మల్లారెడ్డి దుమ్ము దులుపేస్తాడు. తాజాగా మల్లారెడ్డి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన జిమ్ ట్రైనర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో మల్లారెడ్డి జిమ్‌లో తెగ కష్టపడుతూ కనిపించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల మల్లారెడ్డి మనవరాలి పెళ్లిలో మాస్‌ డాన్స్‌తో అదరగొట్టారు. సంగీత్ కార్యక్రమంలో మాస్‌ స్టెప్పులతో ఇరగదీశారు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని.. కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. అప్పట్లో ఈ డాన్స్‌వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.