AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Sagar: జోరుగా హుషారుగా షికారు పోదమా.. నాగార్జునసాగర్ వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్..

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ అంటే ఎంతో మంది పర్యాటకులు ఇష్టపడుతుంటారు. ఆధునిక దేవాలయమైన నాగార్జునసాగర్ డ్యాం ను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. వీకెండ్స్‌లో పర్యాటకులతో నాగార్జున సాగర్ సందడిగా ఉంటుంది. నాగార్జునసాగర్ ను సందర్శించే పర్యాటకులకు గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Nagarjuna Sagar: జోరుగా హుషారుగా షికారు పోదమా.. నాగార్జునసాగర్ వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్..
Nagarjuna Sagar Tourism
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 9:45 AM

Share

రాష్ట్రంలో పర్యాటకరంగం రూపు రేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులను ఆకట్టుకునేలా యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ టూరిజంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పర్యాటకులకు మధురానుభూతి కలిగించేలా కేరళ, కర్ణాతక తరహాలో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. నాగార్జున సాగర్ పరిసరాలు, ముఖ్యంగా డ్యామ్ కొత్త బ్రిడ్జి రోడ్డు, బుద్ధవనం పరిసరాలు వీకెండ్స్‌లో పర్యాటకులతో సందడిగా ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ బోటింగ్, డ్యామ్ వ్యూ పాయింట్, బుద్ధవనం సందర్శనకు ప్రాధాన్యత ఇస్తారు. నాగార్జునసాగర్ కు వచ్చే పర్యాటకుల సైకిల్ రైడింగ్ కు అద్దె సైకిళ్ల సౌకర్యాన్ని కల్పిస్తోంది.

సాగర్ సందర్శనకు వచ్చి విజయ విహార్ లో బస చేసి సాయంత్రం సమయంలో సరదాగా సైకిల్ తొక్కాలనే కోరిక కలిగిన పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సైకిళ్లను ఏర్పాటు చేసింది. నాగార్జున సాగర్ పరిసరాలు, ముఖ్యంగా ఎకో అర్బన్ పార్క్, బుద్ధవనం ప్రాంతాలలో పర్యాటకులు సైక్లింగ్ ఆస్వాదించడానికి సౌకర్యాలు అందుబాటులోకి వస్తోంది.

Nagarjuna Sagar

Rent Bicycles in Nagarjuna Sagar

పచ్చని ప్రకృతి మధ్య, సాగర్ డ్యామ్ వీక్షణతో కూడిన సైక్లింగ్ ఇక్కడ పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. మొదటగా విజయ విహార్ అతిథి గృహంలో గది తీసుకున్న వారికి గంటకు రూ. 100కు సైకిల్ అద్దెగా ఇవ్వడంతో పాటు వాటర్ బాటిల్, హెల్మెట్ ఇవ్వడం జరుగుతుందని విజయ విహార్ మేనేజర్ కిరణ్ కుమార్ చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగార్జునసాగర్ వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇకపై హాయిగా..
నాగార్జునసాగర్ వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇకపై హాయిగా..
టేస్టీ.. టేస్టీ ఫుడ్‌తో పాటు అవి కూడా.. కావాలంటే కేరాఫ్ ఒలివియా!
టేస్టీ.. టేస్టీ ఫుడ్‌తో పాటు అవి కూడా.. కావాలంటే కేరాఫ్ ఒలివియా!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. ఆయనే నా దేవుడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. ఆయనే నా దేవుడు..
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా?మీ వ్యక్తిత్వం ఇదే
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా?మీ వ్యక్తిత్వం ఇదే
భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న..
భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న..
కూతురి పరీక్షలు.. గుడికి వెళ్తూ ఒకరు.. వచ్చే నెలలో పెళ్లి అనగా..
కూతురి పరీక్షలు.. గుడికి వెళ్తూ ఒకరు.. వచ్చే నెలలో పెళ్లి అనగా..
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. త్వరలోనే శంకుస్థాపన
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. త్వరలోనే శంకుస్థాపన
వేడి అన్నంలోకి అదిరిపోయే ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ
వేడి అన్నంలోకి అదిరిపోయే ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ
నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా?ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా?ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు..