AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులు అద్దిరిపోతాయ్

థియేటర్లలో అయినా, ఓటీటీలో అయినా ప్రజెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వారి కోసం ఓటీటీలోకి ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది.

OTT Movie: లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులు అద్దిరిపోతాయ్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 16, 2026 | 10:37 AM

Share

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ప్రతి ఆదివారం ఓ సరికొత్త సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. కథా సుధ పేరుతో వస్తోన్న ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలా ఈ ఆదివారం (మార్చి 15) కూడా సండే స్పెషల్ గా ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో సీనియర్ నటుడు రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించాడు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ వాసంతి , మాధురి, ఆర్యన్, జోష్న, అయేషా, మాధవ్ తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. జై దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాహుబలి నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మించడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆర్యన్, వాసంతి అనే నూతన దంపతులు రైల్వే కాలనీలోకి కొత్తగా కాపురానికి దిగుతారు. ఆర్యన్ తన భార్య వాసంతిని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఇంటి, వంట పనులన్నీ అతను ఒక్కడే చేస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్లకు ఇది ఒక వింతలా అనిపిస్తుంటుంది. ఇంతలో రాజీవ్ కనకాల అక్కడకు వస్తాడు. ఆర్యన్ చేసే పనులను చూసి షాక్ అవుతాడు. అదే సమయంలో అతనిపై అనుమానం కలుగుతుంది. దీంతో ఆర్యన్- వాసంతిల జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటాడు.

ఈ క్రమంలో ఆర్యన్ భార్య హెల్యూషినేషన్‌తో బాధ పడుతుందని తెలుసుకుని బాధపడతాడు రాజీవ్. మరోవైపు ఆర్యన్ గురించి సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఒక అమ్మాయి కోసం ఓ ప్లాన్ ప్రకారమే రైల్వే కాలనీకి ఆర్యన్ వచ్చాడని రాజీవ్ కనుగొంటాడు. అంతేకాదు వాసంతిని అడ్డుతొలగించుకోవాలని పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుసుకుంటాడు. మరి ఆర్యన్ తన భార్యను అడ్గు తొలగించుకున్నాడా? వాసంతి తన భర్త నిజ స్వరూపం తెలుసుకుందా? అసలు రాజీవ్ కనకాల ఏం చేశాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

కేవలం 38 నిమిషాల రన్ టైమ్ తో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ’10/G రైల్వే క్వార్టర్స్’ . లవ్, థ్రిల్, సస్పెన్స్ అంశాలతో ఓ కాలనీలో జరిగే స్టోరీని అది కూడా కేవలం 38 నిమిషాల్లో అద్భుతంగా చూపించారు మేకర్స్. ప్రజెంట్ ఓటీటీ ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

 ఈటీవీ విన్ లో ’10/G రైల్వే క్వార్టర్స్’

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!