New Year 2025 at Space: ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న సునీత విలియమ్స్.. ఎలాగో తెలుసా?
అంతరిక్షంలో కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒక్క రాత్రిలో 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు వస్తాయట. ఈ విషయం ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి సునీత విలియమ్స్ స్వయంగా వెల్లడించారు. తాము 16 సార్లు పగలురాత్రి చూసినట్లు తెలిపారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. మీరూ చూసేయండి..
న్యూఢిల్లీ, జనవరి 1: ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వివిధ దేశాల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి సరికొత్తగా ఆహ్వానం పలకడం ప్రతిసారీ చూసేదే. అయితే ఇదే అనుభూతి అంతరిక్షంలో ఎలా ఉంటుంది? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం స్పేస్‌లో చిక్కుకున్న అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ తమ అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు. అంతరిక్షంలో కొత్త ఏడాదిలో ఏకంగా 16 సుర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూశారట. ఈ విషయాన్ని తెలుపుతూ అంతరిక్షంలోని ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలను స్పేస్ స్టేషన్ హ్యాండిల్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. వీరు ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కదులుతూ ఉండటమే ఇందుకు కారణం.
కాగా గత ఏడాది జూన్‌లో వ్యోమగామి బారీ విల్మోర్‌తో కలిసి బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రం (ISS)లోకి వెళ్లిన సునీత విలియమ్స్ బృందం 9 రోజుల్లో అంటే జూన్ 14న తిరిగి రావల్సి ఉంది. కానీ వీరు వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌లో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక ఇబ్బంది తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడే ఉన్న సునీత విలిమ్స్ టీం గత నెల క్రిస్మస్ పండగకు కూడా స్పేస్‌లోనే ఉన్నారు. యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా షేర్ చేసిన వీడియలో సునీత విలియమ్స్, ఆమె సహోద్యోగులు శాంటా క్యాప్ ధరించి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. ఇక కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా అంతరిక్షంలో సూర్యోదయం, అస్తమయం ఫొటోలను పంపించారు.
As 2024 comes to a close today, the Exp 72 crew will see 16 sunrises and sunsets while soaring into the New Year. Seen here are several sunsets pictured over the years from the orbital outpost. pic.twitter.com/DdlvSCoKo1
— International Space Station (@Space_Station) December 31, 2024
సునీత విలియమ్స్, బారీమోర్ ఈ ఏడాది మార్చిలో భూమికి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నిస్తుంది. నిజానికి ఫిబ్రవరి 2025లో తిరిగి రావాల్సి ఉంది. ఇందుకు క్రూ-9 మిషన్ ప్రయోగించింది. విల్మోర్, విలియమ్స్ అనే మరో ఇద్దరు వ్యోమగాములు సెప్టెంబరు చివరలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇందులో మరో రెండు సీట్లు అదనంగా ఉన్నాయి. ఇది సెప్టెంబర్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. దీంతొ మొత్తం నలుగురూ ఫిబ్రవరిలో భూమికి తిరిగి వస్తారని నాసా ప్రకటించింది. కానీ క్రూ 9 రిలీవ్ చేసేందుకు వెళ్లిన క్రూ 10 ప్రయోగం కూడా వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది మార్చిలో తిరిగి స్వదేశం వచ్చేందుకు నాసా ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. సునీత విలియమ్స్ రోదసి యాత్ర ప్రస్తుతం మూడోది. ఆమె 2006, 2012లో ఆ తర్వాత 2024లో మూడోసారి వెళ్లారు.