Sai Pallavi: న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిపల్లవి.. భక్తులతో కలిసి భజనలు.. వీడియో ఇదిగో
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా విందులు, వినోదాల్లో మునిగి తేలారు. కానీ న్యాచురల్ బ్యూటీ, హీరోయిన్ సాయి పల్లవి మనసు మాత్రం ఆధ్యాత్మికం వైపు వెళ్లింది.
న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవికి దేవుడిపై నమ్మకం ఎక్కువ. అందుకే తరచూ తీర్థయాత్రలు చేస్తుంటుంది. ప్రముఖ దేవాలయాలను సందర్శించుకుంటుంది. ఇటీవలే వారణాసి వెళ్లి అక్కడ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణదేవీ అమ్మవారిని దర్శించుకుంది సాయి పల్లవి. ప్రత్యేకంగా పూజలు కూడా చేసింది. అంతకు ముందు తన చెల్లి, ఫ్రెండ్స్ తో కలిసి ఆస్ట్రేలియాకు కూడా వెళ్లొచ్చింది. ఇక తాజాగా న్యూ ఇయర్ వేళ శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సాయి బాబాను దర్శించుకుంది సాయి పల్లవి. హీరోయిన్ గా కాకుండా సామాన్యురాలిగా భక్తుల్లో కలిసిపోయి ధ్యానం, భజనలు చేసింది. కొత్త సంవత్సరం పురస్కరించుకుని పుట్టపర్తి సాయిబాబా వారి ప్రశాంతి నిలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి కూడా అందరి మధ్య కూర్చొని భజనలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. సాయిపల్లవి సింప్లిసిటీని చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా సాయిపల్లవి శ్రీ సత్యసాయిబాబా భక్తురాలు. ప్రతి ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఆమె పుట్టపర్తి వచ్చి.. బాబా సమాధిని దర్శించుకుంటారు. అంతేకాదు షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడల్లా ప్రశాంతి నిలయానికి వస్తుంటుందీ అందాల తార.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల సాయి పల్లవి నటించిన అమరన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె అక్కినేని నాగచైతన్యతో తెలుగులో `తండేల్` సినిమాలో నటిస్తోంది. చందూమొండేటి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఫిబ్రవరీలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తొంది. దీంతో పాటు బాలీవుడ్ లో రామాయణం అనే సినిమాలో సీతగా కనిపించనుందీ న్యాచురల్ బ్యూటీ. నితీశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు.కేజీఎఫ్ ఫేమ్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సాయి పల్లవి.. వీడియో
Happy New Year Fam…May this year filled with full of WARMTH, LOVE, Good Health , HAPPINESS n Countless Blessings to Everyone…🧿☮️♥️@Sai_Pallavi92#SaiPallavi #HappyNewYear2025 #RadhAmma #PoojaKannan pic.twitter.com/k5xA8bCzsG
— Sai Pallavi FC™ (@SaipallaviFC) January 1, 2025
భక్తులతో కలిసి సాయి పల్లవి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి