AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Sunny : నిజమైన ప్రేమంటే ఇదే.. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో లైఫ్‌నే వదిలేశాడు..

ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులార్ అయ్యారు. ఈ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ తర్వాత చాలా మందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు. వేణు , ధన రాజ్ లాంటివారు దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు.

Jabardasth Sunny : నిజమైన ప్రేమంటే ఇదే.. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో లైఫ్‌నే వదిలేశాడు..
Jabardasth Sunny
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2025 | 10:28 AM

Share

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. మరికొంతమంది దర్శకులుగా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే ఇంకొంతమంది కమెడియన్స్ గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఇక కొంతమంది జబర్దస్త్ లోనే ఉంటూ తమ స్కిట్స్ తో ఆకట్టుకున్నటున్నారు. ఇక జబర్దస్త్ లో ఆకట్టుకుంటున్న కమెడియన్స్ లో సన్నీ ఒకరు. సుడిగాలి సుదీర్ టీమ్ లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్నీ.

తన కామెడీతో .. పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. సన్నీ ఎప్పుడూ తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది. ఆస్తిపాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్నీ. ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ.. లైఫ్ ను వదిలేశాడు సన్నీ. ఈ విషయాన్నీ తానే జబర్దస్త్ ఎపిసోడ్ లో చెప్పాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ప్రేమ, పెళ్లి పై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు సన్నీ.

జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ రష్మీ మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా.. సన్నీ మాట్లాడుతూ.. ఓ అమ్మాయిని ప్రేమించా.. ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది. మరో కమెడియన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సన్నీ మంచి కోటీశ్వరుడు. బోలెడన్ని డబ్బులు ఉన్నాయి.. కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను వదిలేసుకున్నాడు. సన్నీ అన్న, వదిన ఇద్దరూ డాక్టర్స్.. అంత డబ్బున్నా వాడు వాళ్ళ ఇంట్లో ఉండడు.. మా రూమ్స్ కు వచ్చి తాగి పడుకుంటాడు. అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం.. కానీ ఇంత బాధ ఉందా అన్న అని.. నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఇలా సింగల్ గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..