AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’లో క్రేజీ హీరోయిన్.. ఎంత అందంగా ఉందో చూశారా?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. పాన్ ఇండియ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరితో పాటు పలువురు సూపర్ స్టార్స్ ఈ క్రేజీ మూవీలో భాగమయ్యారు.

Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు 'కన్నప్ప'లో క్రేజీ హీరోయిన్.. ఎంత అందంగా ఉందో చూశారా?
Kannappa Movie
Basha Shek
|

Updated on: Dec 30, 2024 | 9:06 PM

Share

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కన్నప్ప. మహా భారతం సీరియల్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించనుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగాన ఉన్నాయి. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నయన తార, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా భారీ తారగణం ఈ సినిమాలో ఉండనుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లతో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసింది కన్నప్ప చిత్ర బృందం. ఇందులో కోలీవుడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. నెమలి అనే రాజకుమార్తె పాత్రలో ఆమె కనిపించనుంది.

కన్నప్ప సినిమాలో ప్రీతి ముకుందన్ పాత్రకు సంబంధించి రిలీజైన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రీతి చాలా అందంగా కనిపిస్తోంది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్ శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్‌ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ మూవీలో ఆమె జలజ అనే పాత్రలో ఆకట్టుకుంది. అలాగే ఒక తమిళ సినిమాలోనూ తళుక్కుమంది. ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

కన్నప్ప సినిమాలో ప్రీతి ముకుందన్ లుక్..

కన్నప్ప సినిమాలో మోహన్ లాల్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి