Katha Kamamishu OTT: ఆహాలో మరో కామెడీ ఎంటర్ టైనర్.. ట్రైలర్ చూస్తే నవ్వులే నవ్వులు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందశాతం తెలుగు కంటెంట్‌ను అందిస్తూ ఓటీటీ రంగంలో దూసుకుపోతోంది. తెలుగు ఆడియెన్స్ అభిరుచులకు తగ్గట్టుగా ప్రతీవారం సరికొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువస్తోంది.
సినిమా లవర్స్ కోసం నూతన సంవత్సరం కానుకగా ఆహా ఓటీటీ ఓ సూపర్బ్ కామెడీ ఎంటర్ టైనర్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంది. అదే ఇంద్రజ, కృతికరాయ్, వెంకటేశ్ కాకుమాను, కృష్ణప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కథా కమామీషు. గౌతమ్-కార్తీక్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా తాజాగా కథాకమామీషు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌ను చూస్తుంటే గ్రామీణ ప్రాంతంలోని ప్రేమలు, అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తోంది. నాలుగు జంటలు, వాళ్ల పెళ్లి, ఫస్ట్ నైట్ కష్టాల చుట్టూ ఈ సినిమా కథ తిరగనుంది తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ తోనే ఆడియెన్స్ ను కడపుబ్బా నవ్వించారు మేకర్స్. పలాస, మట్కా లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమాలో ఓ ఫన్నీ పాత్రలో కనిపించడం విశేషం. తాజాగా కథా కమీషు ట్రైలర్ తో పాటు స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ కామెడీ ఎంటర్ టైనర్ జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ఆహా.
కథా కమామీషు సినిమాకు గౌతమ్ కథ అందించారు. చిన్న వాసుదేవ రెడ్డి ఐ డ్రీమ్ మీడియా, త్రీ విజిల్స్ టాకీస్ బ్యానర్లో సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ధృవన్ సంగీతం అందించాడు. మరి న్యూ ఇయర్‌లో మంచి కామెడీ ఎంటర్ టైన్ మూవీని చూడాలనుకుంటున్నారా? అయితే మీకు కథా కమీషు మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్..
Take a deep breath, relax, and remember that this is just the beginning of your journey together#KathaKamamishu Premieres on 2nd Jan only on aha @KrishnaTeja @Moin_here @KKfilmmaker @karrakar #aha pic.twitter.com/0h7AStrDmC
— ahavideoin (@ahavideoIN) December 30, 2024
కథా కమామీషు ట్రైలర్..
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.