Ganesh Venkatraman: ఈ హ్యాండ్సమ్ విలన్ గుర్తున్నాడా? అతని భార్య కూడా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఢమరుకం ఒకటి. 2012లో రిలీజైన ఈ సోషియా ఫాంటసీ ఎంటర్ టైనర్ లో మెయిన్ విలన్ గా రవిశంకర్ నటించగా మరో నెగెటివ్ రోల్ లో ప్రముఖ తమిళ నటుడు గణేశ్ వెంకట్రామన్ ఆడియెన్స్ ను భయపెట్టాడు.

Ganesh Venkatraman: ఈ హ్యాండ్సమ్ విలన్ గుర్తున్నాడా? అతని భార్య కూడా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
Ganesh Venkatraman
Follow us
Basha Shek

|

Updated on: Dec 29, 2024 | 12:47 PM

శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా ఢమరుకం. 2012లో విడుదలైన ఈ సినిమాలో అనుష్కా శెట్టి కథానాయికగా నటించింది. అంధకాసురుడు అనే భయంకర రాక్షసుడిగా రవిశంకర్ నటించాడు. అలాగే అనుష్కను పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి రాహుల్ పాత్రలో గణేశ్ వెంటట్రామన్ యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో రాహుల్ దే ఇంపార్టెంట్ రోల్. ఓవైపు అనుష్క కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూనే వారికి కీడు చేయాలనే నెగెటివ్ రోల్ లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతోనే తెలుగు వారికి బాగా చేరువయ్యాడు గణేశ్ వెంకట్రామన్. అంతకు ముందు ఈనాడుతో పాటు పలు తమిళ్, హిందీ సినిమాల్లో తళుక్కుమన్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఇప్పటికీ తమిళ సినిమాలతో బిజీగా ఉంటోన్న గణేశ్ తెలుగులోనూ అప్పుడప్పుడు మెరుస్తున్నాడు. త్రిష నాయకి, రాగల 24 గంటల్లో, విజయ్ వారసుడు, శబరి తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరిస్తూనే ఉన్నాడు.

అన్నట్లు గణేష్ భార్య కూడా తెలుగులో క్రేజీ హీరోయినే. ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా? తన పేరు నిషా కృష్ణన్. ఇలా చెబితే గుర్తు పట్టడం కష్టం కానీ విశాల్ హీరోగా నటించిన ‘ఇంద్రుడు’ సినిమాలో హీరోయిన్ అంటే చాలా మందికి గుర్తకు వస్తుంది.అలాగే ‘కృష్ణుడుకి వారసుడు’ అనే తెలుగు సినిమాలోనూ నిషా హీరోయిన్‌గా నటించింది.

ఇవి కూడా చదవండి

భర్త గణేష్ వెంకట్రామన్, పిల్లలతో నిషా కృష్ణన్..

ఇక గణేశ్ భార్య తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ‘శ్రీ మంతుడు’ సీరియల్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇక ‘మహాభారతం’ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఇందులో ఆమె ద్రౌపదిగా నటించి అందరి మన్ననలు అందుకుంది.

ఫ్యామిలీతో గణేశ్ వెంకట్రామన్..

గణేశ్ వెంకట్రామన్, నిషా కృష్ణన్ లది ప్రేమ వివాహం. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2015లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.  వీరికి సమైరా అనే కూతురు, అమర్ అనే కుమారుడు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..