AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinker Sai: ‘డ్రింకర్ సాయి’ బంపరాఫర్.. వారికి ఉచిత సినిమా టికెట్లతో పాటు న్యూ ఇయర్ పార్టీ

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కిన సినిమా డ్రింకర్ సాయి. కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం ప్రేక్షక దేవుళ్ల కోసం ఒక కీలక ప్రకటన చేసింది.

Drinker Sai: ‘డ్రింకర్ సాయి’  బంపరాఫర్.. వారికి ఉచిత సినిమా టికెట్లతో పాటు న్యూ ఇయర్ పార్టీ
Drinker Sai Movie
Basha Shek
|

Updated on: Dec 29, 2024 | 12:17 PM

Share

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా డ్రింకర్ సాయి. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, ట్రైలర్లు మూవీపై ఆసక్తిని పెంచేశాయి. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ యూత్ ను బాగానే అట్రాక్ట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ 27న విడుదలైన డ్రింకర్ సాయి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ధర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మా సినిమా గురించి ట్వీట్ చేసి ప్రోత్సహించిన సాయిదుర్గ తేజ్ అన్నకు థ్యాంక్స్. అలాగే నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా ముగ్గురు నిర్మాతలకు స్పెషల్ థ్యాంక్స్. వాళ్లను లైఫ్‌‌లో మర్చిపోను. ఈ సినిమాతో నేను యూత్‌‌ను చెడగొట్టలేదు అనే పేరొచ్చింది చాలు. మంచి సామాజిక సందేశంతో ఈ సినిమా చేశాం. ముఖ్యంగా మహిళలకు ఈ సినిమా బాగా నచ్చుతోంది. అందుకే మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్స్‌‌ను ఉచితంగా ఇవ్వబోతున్నా’ అని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఇదే సక్సెస్‌ మీట్‌లో డైరెక్టర్ కిరణ్‌ తిరుమల శెట్టి మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని విజయ వంతం చేసిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్‌. ప్రేక్షకుల నుంచే రివ్యూస్‌ తీసుకోబోతున్నాం. అందుకే ఒక కాంటెస్ట్ నిర్వహించాం. ఈ కాంటెస్ట్‌లో ఎంపికైన వారికి డ్రింకర్‌ సాయి ఈ నెల 31న మంచి పార్టీ ఇస్తాడు’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.