OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా..ఐఎండీబీ టాప్ రేటెడ్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ ఏడాది మలయాళ సినిమాలదే హవా. అటు థియేటర్లలో నైనా, ఓటీటీలోనైనా మాలీవుడ్ సినిమాలదే ఆధిపత్యం కొనసాగింది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో మలయాళ సినిమాలకు విశేష ఆదరణ దక్కుతోంది. ఈ క్రమంలోనే మరో మలయాళ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా..ఐఎండీబీ టాప్ రేటెడ్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Mura Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2024 | 9:17 PM

ఈ మధ్య కాలంలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ‘మురా’ ఒకటి. యాక్షన్ రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మాలీవుడ్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయని ప్రశంసలు వినిపించాయి. ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముర’ చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్‌ నాయర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 08న విడుదలైన ఈ సినిమా ఇటీవలే 50 రోజుల వేడుకను కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఐఎండీబీ ఈ మురా సినిమాకు ఏకంగా 7.7 రేటింగ్ ఇవ్వడం విశేషం.  థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన మురా సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20 నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. అయితే అప్పుడు కేవలం మలయాళ వెర్షన్ ను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు . తాజాగా తెలుగు,తమిళ్‌,కన్నడ వంటి భాషలలో నూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం (డిసెంబర్ 28) అర్ధరాత్రి నుంచే మురా సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఇక మురా సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని తిరువనంతపురం చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతూ ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్ తో చేతులు కలుపుతారు. మరి ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే మురా సినిమా కథ. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ‘ముర’ ఓ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. పైగా వీకెండ్ కాబట్టి మంచి టైమ్ పాస్ కూడా అవుతుంది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్..

మురా సినిమా ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!