AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Vishwa Prasad: ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా..మళ్లీ స్టార్ హీరోతోనే జత కట్టారుగా..

టాలీవుడ్‌లో హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసే వారిలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారాయన. అయితే ఈ మధ్యన ఈ బ్యానర్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.

TG Vishwa Prasad: ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా..మళ్లీ స్టార్ హీరోతోనే జత కట్టారుగా..
TG Vishwa Prasad
Basha Shek
|

Updated on: Dec 27, 2024 | 8:36 PM

Share

ప్రస్తుతం టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆశలన్నీ ప్రభాస్ తో తెరకెక్కిస్తోన్న ది రాజా సాబ్ సినిమాపైనే ఉన్నాయి. ఇటీవల ఈ బ్యానర్ నుంచి వచ్చిన మిస్టర్ బచ్చన్, స్వాగ్ సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈ బ్యానర్ చేతిలో ప్రభాస్ ది రాజాసాబ్ తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరోతో సినిమాకు రెడీ అయ్యిందీ నిర్మాణ సంస్థ. అది కూడా కన్నడ స్టార్ హీరోతో. ప్రముఖ కన్నడ నటుడు ‘గోల్డెన్ స్టార్’ గణేష్ నటించిన ‘కృష్ణం ప్రణయ సఖి’ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా సక్సెస్‌తో ఆయనకి డిమాండ్ కూడా పెరిగింది. ‘కృష్ణం ప్రణయ సఖి’ 100 రోజులు విజయవంతంగా నడవడమే కాకుండా, OTTలో ప్రజల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’తో గణేష్ కొత్త సినిమా చేయనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ #PMF49లో గణేష్ నటించనున్నారు. ఈ సినిమా ద్వారా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ కన్నడలోనూ భారీ చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సహకారం అందించింది. ఇప్పుడు ఈ సంస్థ గణేష్ సినిమా ద్వారా శాండల్ వుడ్ లో ఓ లావిష్ మూవీని నిర్మించేందుకు వచ్చింది.

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీని ద్వారా ఓ భారీ ప్రాజెక్ట్ బాధ్యతలను హ్యాండిల్ చేస్తున్నాడు. ఇది దర్శకుడిగా ఆయనకు తొలిచిత్రం. టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్ తో అత్యంత గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ఏంటి? గణేష్‌ సరసన ఎవరు నటిస్తారన్నది మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..