- Telugu News Photo Gallery Cinema photos Heroine Sreeleela open up about her gap in movies for her MBBS Exams, Details here
Sreeleela: జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా.? చిన్న గ్యాప్ అందుకే.!
చదువుకోవాలని కదా అని చిన్న గ్యాప్ ఇచ్చా.! ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కోసం కొన్నాళ్లు సినిమాలను తీసి పక్కనబెట్టా..! అంత మాత్రానికే రేసులో లేననుకున్నారా.. సీన్ అయిపోయిందనుకున్నారా..? అదే ఊపు.. అదే జోరు..! రేసు మొదలుపెడితే నన్నందుకోలేరు అంటున్నారు శ్రీలీల. మరి ఈమె కాన్ఫిడెన్స్‌కు కారణమేంటో తెలుసుకుందాం. ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడతబెట్టడం.. చివర్లో బన్నీతో కలిసి కిస్ కిసిక్ అంటూ స్టెప్పులేయడం మినహాయిస్తే 2024 శ్రీలీలకు పెద్దగా తీసుకొచ్చిందేమీ లేదు.
Updated on: Dec 27, 2024 | 8:32 PM

చదువుకోవాలని కదా అని చిన్న గ్యాప్ ఇచ్చా.! ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కోసం కొన్నాళ్లు సినిమాలను తీసి పక్కనబెట్టా..! అంత మాత్రానికే రేసులో లేననుకున్నారా.. సీన్ అయిపోయిందనుకున్నారా..?

అదే ఊపు.. అదే జోరు..! రేసు మొదలుపెడితే నన్నందుకోలేరు అంటున్నారు శ్రీలీల. మరి ఈమె కాన్ఫిడెన్స్‌కు కారణమేంటో తెలుసుకుందాం.

ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడతబెట్టడం.. చివర్లో బన్నీతో కలిసి కిస్ కిసిక్ అంటూ స్టెప్పులేయడం మినహాయిస్తే 2024 శ్రీలీలకు పెద్దగా తీసుకొచ్చిందేమీ లేదు.

సినిమాలను కాస్త పక్కనబెట్టి.. చదువులపై ఫోకస్ చేసారు ఈ భామ. ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కోసం ఈ ఏడాది చాలా తక్కువ సినిమాలు సైన్ చేసారు శ్రీలీల.

శ్రీలీల జోరు తగ్గేసరికి.. ఈమె రేసు నుంచి తప్పుకుందనే అనుకున్నారంతా. కానీ చిన్న గ్యాప్ ఇచ్చారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 2024 బాకీ మొత్తం 2025లో తీర్చుకోబోతున్నారు.

ఒకటి రెండూ కాదు.. ఏకంగా ఆరు సినిమాలతో రాబోతున్నారు. అందులో ముందుగా నితిన్ రాబిన్ హుడ్ విడుదల కానుంది. క్రిస్మస్ నుంచి 2025కి వాయిదా పడింది ఈ చిత్రం.

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతరతో పాటు నాగ చైతన్య , కార్తిక్ దండు సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఇక తమిళంలో శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ భామే నటిస్తున్నారు. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా.. గ్యాప్ లేకుండా సినిమాలకు సైన్ చేస్తున్నారు శ్రీలీల.




