- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Pan India Star Hero In This Photo She Is KGF Movie Actor Yash
Tollywood: ఒక్క సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కుర్రాడు.. ఇప్పటికీ తండ్రి బస్సు డ్రైవరే..
సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. తాజాగా ఓ పాన్ ఇండియా స్టార్ హీరో చైల్డ్ హుడ్ పిక్ ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ కుర్రాడు ఒక్క సినిమా బాక్సాఫీస్ షేక్ చేశాడు. అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
Updated on: Dec 27, 2024 | 8:25 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ కుర్రాడు ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరో యష్. హీరో కావాలనే కలతో బెంగుళూరు వచ్చాడు. ఓ సాధారణ బస్సు డ్రైవర్ కుమారుడు ఇప్పుడు సినీరంగంలో చక్రం తిప్పుతున్నాడు.

బుల్లితెరపై పలు సీరియల్లలో హీరోగా నటించాడు. ఆ తర్వాత సినిమాల్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా పనిచేశాడు. చివరకు హీరోగా వెండితెరపై మెరిశాడు. హీరోగా కన్నడ సినిమాల్లో నటించి మెప్పించాడు.

ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ హీరో పేరు మారుమోగింది.

కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో ఓ రేంజ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న యష్.. ఇప్పుడు టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నాడు. కొడుకు స్టార్ హీరో అయినప్పటికీ యష్ తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవర్ గానే పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం టాక్సిక్ సినిమాతోపాటు హిందీలో రామాయణ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో యష్ రావణుడి పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.




