- Telugu News Photo Gallery Cinema photos Super star Rajinikanth jailer sequel movie will be going on sets after coolie movie, details here
Rajinikanth: యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్ లో పెట్టారా.?
రెస్ట్ మోడ్‌ని పాజ్‌లో పెట్టేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏదైనా ఫటాఫట్ కానిచ్చేయాలని ఫిక్సయ్యారు. అందుకే ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే, ఇంకో సినిమా పనులు కంప్లీట్ చేస్తున్నారు.ఈ వయసులో ఆయనే ఇంత యంగ్‌గా ఉరుకులు పరుగులు తీస్తుంటే, మనం ఇంకెలా ఉండాలనే ఉత్సాహం కలుగుతోంది యంగ్‌స్టర్స్ లో. వేట్టయన్ సినిమా ఎలా ఉంది? బావుందా? బాగలేదా?
Updated on: Dec 27, 2024 | 8:48 PM

రెస్ట్ మోడ్‌ని పాజ్‌లో పెట్టేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏదైనా ఫటాఫట్ కానిచ్చేయాలని ఫిక్సయ్యారు. అందుకే ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే, ఇంకో సినిమా పనులు కంప్లీట్ చేస్తున్నారు.

ఈ వయసులో ఆయనే ఇంత యంగ్‌గా ఉరుకులు పరుగులు తీస్తుంటే, మనం ఇంకెలా ఉండాలనే ఉత్సాహం కలుగుతోంది యంగ్‌స్టర్స్ లో. వేట్టయన్ సినిమా ఎలా ఉంది? బావుందా? బాగలేదా?

రజనీకి ఎలాంటి పేరొచ్చింది.. వీటన్నిటి గురించీ రోజుల తరబడి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు రజనీకాంత్. నిన్నటి గురించి ఆలోచిస్తూ ఆగిపోతే ఇవాళ పనులు జరగవు.

రేపటి గురించి కలలు అలాగే మిగిలిపోతాయని బాగా తెలుసు సూపర్‌స్టార్‌కి. అందుకే పని మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. జైలర్‌తో ఫుల్ పామ్‌లోకి వచ్చేశారు తలైవర్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అటు ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి కాల్షీట్ అలాట్ చేసేశారు. హుకుమ్ ఎలా ఉంటుందో చూడ్డానికి రెడీగా ఉండమని సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఫస్టు పార్టుతో పోలిస్తే సెకండ్ పార్టులో మరింత స్టైలిష్‌గా కనిపిస్తారట సూపర్‌స్టార్.

అందుకోసం ఆయన కొన్నాళ్ల పాటు మేకోవర్ టైమ్ తీసుకోవాలని ఫిక్సయ్యారట. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా పనుల్లో ఉన్నారు రజనీకాంత్. కూలీ షూటింగ్ పూర్తి కాగానే, ఇమీడియేట్‌గా జైలర్2 సెట్స్ కి వెళ్లడం లేదు.

జైలర్ 2 క్యారక్టర్ ప్రిపరేషన్ కోసం టైమ్ స్పెండ్ చేయాలని ఫిక్సయ్యారు. సో.. బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు దద్దరిల్లుతాయన్నది తలైవర్ కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం.




