- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Worked as Background Dancer Now Her Net Worth rs 500 Crores, She Is Deepika Padukone
Tollywood : ఫస్ట్ మూవీకి 2 వేల రెమ్యునరేషన్.. ఇప్పుడు రూ.500 కోట్ల ఆస్తులు.. ఎవరో తెలుసా..
కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. తెలుగులో మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది.
Updated on: Dec 27, 2024 | 8:45 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. తొలి సినిమా ఛాన్స్ ఏకంగా షారుఖ్ ఖాన్ సరసన అందుకుంది. అయితే ఫస్ట్ మూవీకి రూ.2000 పారితోషికం తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు రూ.500 కోట్లకు యజమాని.

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ దీపికా పదుకొణె. కొన్నాళ్ల క్రితం ఆమె బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా పనిచేసింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. సినిమా ప్రపంచంలోకి రాకముందు మోడలింగ్ చేసేది.

పలు ప్రకటనలలో నటించింది. హిమేష్ రేష్మియా తొలి ఆల్బమ్ 'ఆప్ కా సురూర్'లో దీపికా పదుకొణె బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసింది. ఈ ఆల్బమ్ 2006 సంవత్సరంలో విడుదలైంది.

ఆ తర్వాత షారుఖ్ ఖాన్ జోడిగా ఓం శాంతి ఓం సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమయ్యింది. ఈ సినిమా కోసం 2000 రూపాయలు పారితోషికం తీసుకుంది. ఈ సినిమా 2007లో విడుదలైంది.

బెంగళూరులోని సోఫియా హైస్కూల్‌లో చదువుకున్న దీపికా.. కాలేజీ డ్రాపౌట్. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. హిందీలో అనేక హిట్ సినిమాల్లో నటించింది. దీపిక నికర విలువ రూ.500 కోట్లు.




