- Telugu News Photo Gallery Cinema photos Ranbir Kapoor and Alia Bhatt daughter Raha melts hearts with sweet hi and flying kiss at Kapoor family Christmas lunch
Alia Bhatt: ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్ చూశారా?
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా ఈ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అలియా-రణ్ బీర్ కపూర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్ గా మారాయి.
Updated on: Dec 27, 2024 | 11:06 PM

సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

బాలీవుడ్ లవ్లీ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా గత క్రిస్మస్ పండగ సమయంలో తమ గారాల పట్టి రాహా ఫొటోను వారు ప్రపంచానికి పరిచయం చేశారు అలియా భట్ - రణ్ బీర్ కపూర్.

ఇక ఈ ఏడాదిలో తన తల్లిదండ్రులతో పాటు 'మెర్రీ క్రిస్మస్' శుభాకాంక్షలు తెలిపింది రాహా. ఫోటోగ్రాఫర్స్ వైపు చేతులు ఊపుతూ.. వారికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూఈ స్టార్ కిడ్ కనిపించింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అభిమానులన పలకరించడంలో రాహా అమ్మానాన్నలను మించిపోయిందంటున్నారు నెటిజన్లు.




