Pushpa 2 The Rule: తగ్గేదే లే..! బాహుబలిని బీట్ చేసే ఊపులో పుష్ప రాజ్..
సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారుతున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలు వందల కోట్లు దాటి వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేస్తూ నయా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు పుష్ప 2 సినిమా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది. మరికొద్ది రోజుల్లో బాహుబలి రికార్డ్ ను పుష్ప 2 బీట్ చేయనుంది.
Bahubali 2, Pushpa 2
Follow us
సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారుతున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలు వందల కోట్లు దాటి వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేస్తూ నయా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు పుష్ప 2 సినిమా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది.
ముందుగా భారీగా వసూళ్లను రాబట్టి సినిమాల్లో మొదటి స్థానంలో దంగల్ సినిమా ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. నితీష్ తివారి దర్శకతవరంలో తెరక్కేక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 2024.6కోట్లు వసూల్ చేసింది.
ఇక అదిత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో సెకండ్ ప్లేస్ లో బాహుబలి 2 ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి 2 సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1742.3 కోట్లు రాబట్టింది.
ఇక ఇప్పుడు మూడో స్థానంలో పుష్ప 2 నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికీ థియేటర్స్ లో రాణిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1719.5కోట్లు వసూల్ చేసింది. త్వరలోనే బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేయనుంది పుష్ప 2.
ఇక నాలుగో స్థానంలో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1250.9 కోట్లు వసూల్ చేసింది. అలాగే ఈ సినిమా తర్వాత యష్ కేజీఎఫ్ 2 సినిమా నిలిచింది. ఈ మూవీ రూ. 1176.5కోట్లు వసూల్ చేసింది.