Allu Arjun: ‘ చీప్ పబ్లిసిటీ.. అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి’.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ట్వీట్

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో సికింద్రా బాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Allu Arjun: ' చీప్ పబ్లిసిటీ.. అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ట్వీట్
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2024 | 9:29 PM

‘పుష్ప-2’ ప్రీమియర్ షోల్లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య థియేటర్ నిర్వాహకులతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ఏ 11గా ఉన్న బన్నీని ఆకస్మికంగా అరెస్ట్ చేయడం విమర్శలకు దారి తీసింది. అయితే బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చినా ఈ ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మరోసారి ఈ ఘటనపై మాట్లాడడం, ఆ తర్వాత పోలీసులు మరోసారి అల్లు అర్జున్ ను విచారణ పిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు దూరం పెరుగుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో అరెస్టైన అల్లు అర్జున్ కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులంతా తరలి వచ్చారు. అలాగే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ విషయంలో అల్లు అర్జున్ కు సపోర్టుగానే నిలుస్తున్నారు.

ఈ కేసు విషయంలో ప్రముఖ హీరోయిన్ సంజన గల్రానీ అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచింది. బన్నీకి సపోర్టు చేస్తూ ఆమె వరుస ట్వీట్టు చేస్తోంది. ‘అల్లు అర్జున్ కు అండగా మేమున్నాము. చీప్ పబ్లిసిటీ కోసం ఉన్నత స్థాయిలో ఉన్నవారిని టార్గెట్ చేయడం మానేయండి’ అని ట్వీట్ చేసింది సంజన. అంతేకాకుండా అల్లు అర్జున్‌కు సంబంధించి వివిధ న్యూస్ ఛానెల్స్ లో వస్తోన్న వీడియోలను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

కన్నడ ఇండస్ట్రీకి చెందిన సంజన గల్రానీ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్ పోలీస్, దుశ్శాసనుడు, ముగ్గురు, యమహో యమ, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్, దండుపాళ్యం 3 తదితర సినిమాల్లోనూ నటించింది. అయితే ఆ మధ్యన డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఫేడ్ ఔట్ అయిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.